గామిడిని నీవు కైలాటాలు వెట్టేనని
(॥పల్లవి॥)
గామిడిని నీవు కైలాటాలు వెట్టేనని
యేమరించఁ జూచేవు యిద్దరము నొకటే
(॥గామి॥)
మంతనాన నేనీతో మాటలాడినవియెల్ల
అంతరంగముగఁ జెప్పె ఆపె నాతోను
మంతుకెక్కినట్టినీమతకాలే వేరుగాని
ఇంతులము తొల్లే నేము నిద్దరమునొకటే
(॥గామి॥)
గుఱుతుగా నీవు నేనుఁ గూడినకూటములెల్లా
యెఱుకగా నాపె నీ(నా?) తో యెచ్చరించెను
నెఱవుగా నన్నిటానునీవే కపటివిగాని
యెఱఁగ మామేలెల్లా నిద్దరము నొకటే
(॥గామి॥)
చెప్పరానిమనలోని నేసుకొంటి బాసలెల్లా
చప్పిడించ కాపె నాతో సన్న సేసెను
ముప్పిరి శ్రీవేంకటేశ మోహయించితి విద్దరికి
యెప్పుడు నీపాలిటికి నిద్దరము నొక్కటే
(||pallavi||)
gāmiḍini nīvu kailāḍālu vĕṭṭenani
yemariṁcham̐ jūsevu yiddaramu nŏgaḍe
(||gāmi||)
maṁtanāna nenīdo māḍalāḍinaviyĕlla
aṁtaraṁgamugam̐ jĕppĕ ābĕ nādonu
maṁtugĕkkinaṭṭinīmadagāle verugāni
iṁtulamu tŏlle nemu niddaramunŏgaḍe
(||gāmi||)
guṟudugā nīvu nenum̐ gūḍinagūḍamulĕllā
yĕṟugagā nābĕ nī(nā?) to yĕchchariṁchĕnu
nĕṟavugā nanniḍānunīve kabaḍivigāni
yĕṟam̐ga māmelĕllā niddaramu nŏgaḍe
(||gāmi||)
sĕpparānimanaloni nesugŏṁṭi bāsalĕllā
sappiḍiṁcha kābĕ nādo sanna sesĕnu
muppiri śhrīveṁkaḍeśha mohayiṁchidi viddarigi
yĕppuḍu nībāliḍigi niddaramu nŏkkaḍe