Evvarunu tamavale nemchavaddaa

ఎవ్వరును తమవలె నెంచవద్దా
Language

(॥పల్లవి॥)
ఎవ్వరును తమవలె నెంచవద్దా
రవ్వకెక్క సవతుల రాఁపు సేతురు

(॥ఎవ్వ॥)
ఆతఁడింటికి రాకుంటే నాడితివి వెంటేలెల్లా
చేతికిలోనైతేనే చెలఁగితివి
నీతులు చెప్పేవు నేము నీవంటివారమే కామా
యేతులకు మాకు బుద్దులేల చెప్పేవు

(॥ఎవ్వ॥)
వెక్కసమై తిరిగితే వెసఁ గోపగించితివి
చెక్కు నిన్ను నొక్కితేనే చేకొంటివి
నెక్కొని నోరది మేవు నేము నీవలెనేకాదా
యెక్కువతగవులు మాకేల చెప్పేవు

(॥ఎవ్వ॥)
మఱచి వూరకుండితే మర్మాలుసోఁకించితివి
మఱియట్టె యలమేలుమంగ మెచ్చితి
నెఱతనాలు నేర్పేవు నీవంటివారమే కామా
మెఱయ శ్రీవేంకటేశు మెచ్చి పెండ్లి సేసేవు

(||pallavi||)
ĕvvarunu tamavalĕ nĕṁchavaddā
ravvagĕkka savadula rām̐pu seduru

(||ĕvva||)
ādam̐ḍiṁṭigi rāguṁṭe nāḍidivi vĕṁṭelĕllā
sedigilonaidene sĕlam̐gidivi
nīdulu sĕppevu nemu nīvaṁṭivārame kāmā
yedulagu māgu buddulela sĕppevu

(||ĕvva||)
vĕkkasamai tirigide vĕsam̐ gobagiṁchidivi
sĕkku ninnu nŏkkidene segŏṁṭivi
nĕkkŏni noradi mevu nemu nīvalĕnegādā
yĕkkuvadagavulu māgela sĕppevu

(||ĕvva||)
maṟasi vūraguṁḍide marmālusom̐kiṁchidivi
maṟiyaṭṭĕ yalamelumaṁga mĕchchidi
nĕṟadanālu nerbevu nīvaṁṭivārame kāmā
mĕṟaya śhrīveṁkaḍeśhu mĕchchi pĕṁḍli sesevu