Evvarumtaa neṟamgavu yeraa neevu

ఎవ్వరుంటా నెఱఁగవు యేరా నీవు
Language

(॥పల్లవి॥)
ఎవ్వరుంటా నెఱఁగవు యేరా నీవు
యివ్వల దగ్గరిననా కిది వెద్దలా

(॥॥)
మానరా నీవు నాతోడిమందెమేళాలు
నానఁబెట్టి యేడనైనా నవ్వవచ్చేవు
నేనూ నీ పొరుగైతే నేరమాయనా
పూని మావా రిందిగంటే పోరులు రావా

(॥॥)
గుట్టుతోడ నుండరా కొంతైనా నీవు
చిట్టకానకుఁ నా మీఁదఁ జేయి వేసేవు
ఇట్టె నీమోము చూచితే నియ్యకొంటినా
గట్టిగా మగనాలనుఁ గానా నేను

(॥॥)
ఆయరా నేఁడింతలోనే అన్నిపనులు
ఆయములు సోఁక నన్ను నానవెట్టేవు
యీయెడ శ్రీ వేంకటేశ యెనసితివి! నన్ను
చాయల సన్నల నిదె సతమాయఁగా

(||pallavi||)
ĕvvaruṁṭā nĕṟam̐gavu yerā nīvu
yivvala daggarinanā kidi vĕddalā

(||||)
mānarā nīvu nādoḍimaṁdĕmeḽālu
nānam̐bĕṭṭi yeḍanainā navvavachchevu
nenū nī pŏrugaide neramāyanā
pūni māvā riṁdigaṁṭe porulu rāvā

(||||)
guṭṭudoḍa nuṁḍarā kŏṁtainā nīvu
siṭṭagānagum̐ nā mīm̐dam̐ jeyi vesevu
iṭṭĕ nīmomu sūside niyyagŏṁṭinā
gaṭṭigā maganālanum̐ gānā nenu

(||||)
āyarā nem̐ḍiṁtalone annibanulu
āyamulu som̐ka nannu nānavĕṭṭevu
yīyĕḍa śhrī veṁkaḍeśha yĕnasidivi! nannu
sāyala sannala nidĕ sadamāyam̐gā