Evvarumdudaa neṟaga vemta sigguvidisevu

ఎవ్వరుండుటా నెఱగ వెంత సిగ్గువిడిచేవు
Language

(॥పల్లవి॥)
ఎవ్వరుండుటా నెఱగ వెంత సిగ్గువిడిచేవు
దవ్వు చేరువల నెంత తగవురా నీది

(॥ఎవ్వ॥)
నలిరేఁగి వూరకైనా నవ్వులు నవ్వ వచ్చేవు
చెలఁగి యెవ్వతె నీకుఁ జెప్పెరా యిది
చలమున నీచేతులు సారెకుఁ బైవేసేవు
తలపోయ నెటువంటితమిరా నీది

(॥ఎవ్వ॥)
కమ్మరఁగమ్మర నిట్టె కాణతాళలే నెరపేవు
నెమ్మది నెవ్వతె యింత నేర్పరా యిది
వుమ్మడి నిందరిలోనే వొడివట్టి పెనఁగేవు
పమ్మినేఁడు యెటువంటి బలుపురా నీది

(॥ఎవ్వ॥)
కలుపుకోలుగ నిట్టె కాఁగిలించి కూడేవు
పొలసి యెవ్వతె యెగపోసెరా నీకు
అలమేలుమంగను నే నవుర శ్రీవేంకటేశుఁడ
మొలచిన దెటువంటి మోహమురా నీది

(||pallavi||)
ĕvvaruṁḍuḍā nĕṟaga vĕṁta sigguviḍisevu
davvu seruvala nĕṁta tagavurā nīdi

(||ĕvva||)
nalirem̐gi vūragainā navvulu navva vachchevu
sĕlam̐gi yĕvvadĕ nīgum̐ jĕppĕrā yidi
salamuna nīsedulu sārĕgum̐ baivesevu
talaboya nĕḍuvaṁṭidamirā nīdi

(||ĕvva||)
kammaram̐gammara niṭṭĕ kāṇadāḽale nĕrabevu
nĕmmadi nĕvvadĕ yiṁta nerbarā yidi
vummaḍi niṁdarilone vŏḍivaṭṭi pĕnam̐gevu
pamminem̐ḍu yĕḍuvaṁṭi baluburā nīdi

(||ĕvva||)
kalubugoluga niṭṭĕ kām̐giliṁchi kūḍevu
pŏlasi yĕvvadĕ yĕgabosĕrā nīgu
alamelumaṁganu ne navura śhrīveṁkaḍeśhum̐ḍa
mŏlasina dĕḍuvaṁṭi mohamurā nīdi