Evvarum jepparu neegu nemisesedi

ఎవ్వరుఁ జెప్పరు నీకు నేమిసేసేది
Language

(॥పల్లవి॥)
ఎవ్వరుఁ జెప్పరు నీకు నేమిసేసేది
జవ్వనపాయముగా సటలు రేఁచేది

(॥ఎవ్వ॥)
పంతము నీవాడేవట పట్టరాదా యెగ్గు మేము
యెంతనేరుపరివి నిన్నేమిచెప్పేది
అంతదొరవు నీవైతే నాఁడువారు సదరమా
దొంతుల యీతగవేల తోఁచదో కాక

(॥ఎవ్వ॥)
రావాడి గోరూఁదేవట రాసి నే జంకించరాదా
యేవల్ల నేర్చితివి నిన్నేమిచెప్పేది
నీవే చదువనేర్చితే నెలఁతలు తుచ్చమైర
యీవేళ నీవిచారము యేలలేదో కాని

(॥ఎవ్వ॥)
తక్కక కూడితివట తమకించరాదా నేను
యెక్కడఁగలిగె బుద్దు లేమిచెప్పేది
నిక్కి దేవరవై తేనే నీవారుగారా సతులు
ఇక్కువ శ్రీవేంకటేశ యేల మంకో కాక

(||pallavi||)
ĕvvarum̐ jĕpparu nīgu nemisesedi
javvanabāyamugā saḍalu rem̐sedi

(||ĕvva||)
paṁtamu nīvāḍevaḍa paṭṭarādā yĕggu memu
yĕṁtanerubarivi ninnemisĕppedi
aṁtadŏravu nīvaide nām̐ḍuvāru sadaramā
dŏṁtula yīdagavela tom̐sado kāga

(||ĕvva||)
rāvāḍi gorūm̐devaḍa rāsi ne jaṁkiṁcharādā
yevalla nersidivi ninnemisĕppedi
nīve saduvanerside nĕlam̐talu tuchchamaira
yīveḽa nīvisāramu yelaledo kāni

(||ĕvva||)
takkaga kūḍidivaḍa tamagiṁcharādā nenu
yĕkkaḍam̐galigĕ buddu lemisĕppedi
nikki devaravai tene nīvārugārā sadulu
ikkuva śhrīveṁkaḍeśha yela maṁko kāga