ఎవ్వరు విన్నవించేరు ఇట్టైతే నీకు
(॥పల్లవి॥)
ఎవ్వరు విన్నవించేరు ఇట్టైతే నీకు
నివ్వటిల్ల నీవే కరుణించవలెఁ గాక
(॥ఎవ్వ॥)
చిగురుమోవిమీఁది చిప్పిలుతేనెలతోడ
మగువ నీతోనదే మాటలాడీని
వెగటుగ నీవైతే వేరొక్కతెమోము చూచి
అగపడి యందే పరాకై వున్నాఁడవు
(॥ఎవ్వ॥)
చిక్కనిచూపులతోడ సెలవినవ్వులతోడ
నెక్కువగా నీకుఁ జెయ్యెత్తి మొక్కీని
చెక్కునొక్కి నీవైతే సిగ్గులువడుచు వే
రొక్కతెచన్నులు గోర నూఁదుచునున్నాఁడవు
(॥ఎవ్వ॥)
బొమ్మల జంకెనతోడ పోరచి ముద్దులతోడ
కొమ్మ శ్రీవేంకటేశ్వర కూడె నిన్నును
వుమ్మడి నీవైతే నాపె నొనగూడి యీసతికి
పమ్మిన బాసలతోడ బత్తియై వున్నాఁడవు
(||pallavi||)
ĕvvaru vinnaviṁcheru iṭṭaide nīgu
nivvaḍilla nīve karuṇiṁchavalĕm̐ gāga
(||ĕvva||)
sigurumovimīm̐di sippiludenĕladoḍa
maguva nīdonade māḍalāḍīni
vĕgaḍuga nīvaide verŏkkadĕmomu sūsi
agabaḍi yaṁde parāgai vunnām̐ḍavu
(||ĕvva||)
sikkanisūbuladoḍa sĕlavinavvuladoḍa
nĕkkuvagā nīgum̐ jĕyyĕtti mŏkkīni
sĕkkunŏkki nīvaide sigguluvaḍusu ve
rŏkkadĕsannulu gora nūm̐dusununnām̐ḍavu
(||ĕvva||)
bŏmmala jaṁkĕnadoḍa porasi mudduladoḍa
kŏmma śhrīveṁkaḍeśhvara kūḍĕ ninnunu
vummaḍi nīvaide nābĕ nŏnagūḍi yīsadigi
pammina bāsaladoḍa battiyai vunnām̐ḍavu