ఎవ్వరు వద్దనేరు నీవేమి సేసినా
(॥పల్లవి॥)
ఎవ్వరు వద్దనేరు నీవేమి సేసినా
జవ్వని వలచి వచ్చెఁ జనవియ్యరాదా
(॥ఎవ్వ॥)
కొమెరవయసుకాంత కోరి నీతో మాటలాడీ
తమితోడ వినవయ్యా తలవంచక
చెమటలు గారఁగాను చేరి నీపాదాలొత్తీ
జమళిఁ దొడల మీఁదఁ జాఁచరాదా ఇపుడు
(॥ఎవ్వ॥)
ననుపుగలయాఁటది నవ్వుల నవ్వీ నీతో
చెనకి యియ్యకోవయ్యా సిగ్గువడక
వినయముతో నీకు వీడెము చేతికిచ్చీ
కొనగోర(రు?) సోఁక నందుకొనరాదా ఇపుడు
(॥ఎవ్వ॥)
దేవులలమేల్మంగనతివి నీకు నీకె మొక్కీ
వేవేగ నేలుకోవయ్యా వింతసేయక
యీవేళ శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
కైవశమై వుండరాదా కలసి నీ విపుడు
(||pallavi||)
ĕvvaru vaddaneru nīvemi sesinā
javvani valasi vachchĕm̐ janaviyyarādā
(||ĕvva||)
kŏmĕravayasugāṁta kori nīdo māḍalāḍī
tamidoḍa vinavayyā talavaṁchaga
sĕmaḍalu gāram̐gānu seri nībādālŏttī
jamaḽim̐ dŏḍala mīm̐dam̐ jām̐sarādā ibuḍu
(||ĕvva||)
nanubugalayām̐ṭadi navvula navvī nīdo
sĕnagi yiyyagovayyā sigguvaḍaga
vinayamudo nīgu vīḍĕmu sedigichchī
kŏnagora(ru?) som̐ka naṁdugŏnarādā ibuḍu
(||ĕvva||)
devulalamelmaṁganadivi nīgu nīgĕ mŏkkī
vevega nelugovayyā viṁtaseyaga
yīveḽa śhrīveṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
kaivaśhamai vuṁḍarādā kalasi nī vibuḍu