Evvaru vadda nunnaaro yemi seseene

ఎవ్వరు వద్ద నున్నారో యేమి సేసీనే
Language

(॥పల్లవి॥)
ఎవ్వరు వద్ద నున్నారో యేమి సేసీనే
దవ్వుల నెదురురాక తా నేమి సేసీనే

(॥॥)
పచ్చనిచిగురువంటి పాదాల నడచివచ్చె-
నిచ్చకపుఁబతి లోన నేమి సేసీనే
నెచ్చలిమే నింతలోన నిండాఁ గడుఁజెమరించె
యెచ్చటఁ బరాకైనాఁ డేమిసేసీనే

(॥॥)
మంచిమాణికాలురాలేమాట లాడీఁ జెలి యీడ
ఇంచుకంతా నెఱఁగడు యేమి సేసీనే
మంచముపైఁ బవ్వళించె మగుళ యలసి వచ్చి
యెంచినయెన్నికలాయ నేమిసేసీనే

(॥॥)
కలువరేకులవంటి కన్నులఁ జూచె చెలి-
నెలమిఁదాఁ దేరిచూచీ నేమీ సేసీనే
బలిమి శ్రీ వేంకటాద్రిపతి యింతి నిటు గూడె
యిలఁ దనభాగ్యమాయ నేమి సేసీనే

(||pallavi||)
ĕvvaru vadda nunnāro yemi sesīne
davvula nĕdururāga tā nemi sesīne

(||||)
pachchanisiguruvaṁṭi pādāla naḍasivachchĕ-
nichchagabum̐badi lona nemi sesīne
nĕchchalime niṁtalona niṁḍām̐ gaḍum̐jĕmariṁchĕ
yĕchchaḍam̐ barāgainām̐ ḍemisesīne

(||||)
maṁchimāṇigālurālemāḍa lāḍīm̐ jĕli yīḍa
iṁchugaṁtā nĕṟam̐gaḍu yemi sesīne
maṁchamubaim̐ bavvaḽiṁchĕ maguḽa yalasi vachchi
yĕṁchinayĕnnigalāya nemisesīne

(||||)
kaluvaregulavaṁṭi kannulam̐ jūsĕ sĕli-
nĕlamim̐dām̐ derisūsī nemī sesīne
balimi śhrī veṁkaḍādribadi yiṁti niḍu gūḍĕ
yilam̐ danabhāgyamāya nemi sesīne