ఎవ్వరు చెప్పిరే నీకు నేఁటి వోజే
(॥పల్లవి॥)
ఎవ్వరు చెప్పిరే నీకు నేఁటి వోజే
జవ్వనపువారి కింత చలములు చెల్లునా
(॥ఎవ్వ॥)
మోము చూచినదానవు మోన మేఁటికే నీకు
వేమరు మాటాడితేను వేడుక గాదా
కామిం చింతకపటము గలదాన వై తేను
నాములఁ గూటమి గొంత నడపఁగఁ జెల్లునా
(॥ఎవ్వ॥)
తగిలి వచ్చిననీవు తల వంచుకో నేల
సొగిసి యిట్టె తప్పక చూతువు గాక
జగడాల నంతపగ సాదించవలసితేను
జిగిఁ జుట్టరికములు చెప్ప నిందు చెల్లునా
(॥ఎవ్వ॥)
కలసితివి కాఁగిట గర్వము లిఁక నేల
చెలఁగి యేమైనా సేవ సేతువు గాక
అలరి శ్రీవేంకటేశు ఆలవైతి విఁక నైతే
బలుము లింతటిమీఁద పచరించఁ జెల్లునా
(||pallavi||)
ĕvvaru sĕppire nīgu nem̐ṭi voje
javvanabuvāri kiṁta salamulu sĕllunā
(||ĕvva||)
momu sūsinadānavu mona mem̐ṭige nīgu
vemaru māḍāḍidenu veḍuga gādā
kāmiṁ siṁtagabaḍamu galadāna vai tenu
nāmulam̐ gūḍami gŏṁta naḍabam̐gam̐ jĕllunā
(||ĕvva||)
tagili vachchinanīvu tala vaṁchugo nela
sŏgisi yiṭṭĕ tappaga sūduvu gāga
jagaḍāla naṁtabaga sādiṁchavalasidenu
jigim̐ juṭṭarigamulu sĕppa niṁdu sĕllunā
(||ĕvva||)
kalasidivi kām̐giḍa garvamu lim̐ka nela
sĕlam̐gi yemainā seva seduvu gāga
alari śhrīveṁkaḍeśhu ālavaidi vim̐ka naide
balumu liṁtaḍimīm̐da pasariṁcham̐ jĕllunā