ఎవ్వరు చెప్పిరంటాను యేల నన్నడిగేవు
(॥పల్లవి॥)
ఎవ్వరు చెప్పిరంటాను యేల నన్నడిగేవు
మవ్వపు నీనిట్టూర్పులే మర్మాలు చూపీని
(॥ఎవ్వ॥)
చెంది నీచెక్కులఁగా రేచెమటలవల్లనే
కందువ నీచేఁతలెల్లాఁ గానవచ్చీని
ముందుముందుగానే నీమోముకళవల్లనే
ఇందరిలో నీవేడుక లెఱిఁగించీని
(॥ఎవ్వ॥)
చెంత చెక్కుచేతితోడ సిగ్గువడేవల్లనే
వింతనీభావము వెల్లవిరియయ్యీని
పంతపునీనవ్వులు పచారించేవల్లనే
యింతటా నీసుద్ది చొప్పులెత్తి యిచ్చీని
(॥ఎవ్వ॥)
పలుమారు నీవు తప్పకచూచేవల్లనే
వలచినవలపులు వంతు కెక్కీని
అలమేలుమంగపతివైన శ్రీవేంకటేశ్వర
కలసితివి నన్ను నీకతలు మెప్పించీని
(||pallavi||)
ĕvvaru sĕppiraṁṭānu yela nannaḍigevu
mavvabu nīniṭṭūrbule marmālu sūbīni
(||ĕvva||)
sĕṁdi nīsĕkkulam̐gā resĕmaḍalavallane
kaṁduva nīsem̐talĕllām̐ gānavachchīni
muṁdumuṁdugāne nīmomugaḽavallane
iṁdarilo nīveḍuga lĕṟim̐giṁchīni
(||ĕvva||)
sĕṁta sĕkkusedidoḍa sigguvaḍevallane
viṁtanībhāvamu vĕllaviriyayyīni
paṁtabunīnavvulu pasāriṁchevallane
yiṁtaḍā nīsuddi sŏppulĕtti yichchīni
(||ĕvva||)
palumāru nīvu tappagasūsevallane
valasinavalabulu vaṁtu kĕkkīni
alamelumaṁgabadivaina śhrīveṁkaḍeśhvara
kalasidivi nannu nīgadalu mĕppiṁchīni