ఎవ్వరు చెప్పిన వినకింత చేసుకొనె నింతి
(॥పల్లవి॥)
ఎవ్వరు చెప్పిన వినకింత చేసుకొనె నింతి
పువ్వువలె మన్ననలఁ బోదిసేయవయ్యా
(॥ఎవ్వ॥)
అచ్చలాన చెలి నీయండ నుండి పొందు చేసి
పచ్చిచేసుకొనె మేను పడఁతి
విచ్చనవిడి తోడనే విడెము నీచేతికిచ్చి
మెచ్చులుగా వలపులు మెడఁ గట్టుకొనెను
(॥ఎవ్వ॥)
మొగమోటములనే మోవి నీకు విందు చెప్పి
తగిలించుకొనె మేలు తరుణి
నగుతానే నీరూపు నాఁటుకొనఁ జూచి చూచి
తగినంతఁ దనుఁ దానే తమి రేఁచుకొనెను
(॥ఎవ్వ॥)
అందపుఁ జన్నులనొత్తి అంటఁ గాఁగిలించి కూడి
కందువతోఁ బెండ్లాడెఁ గలికి
సందడి శ్రీవేంకటేశ సారె నీకు మొక్కి మొక్కి
అందెంది పట్టిపుదేవు లనిపించుకొనెను
(||pallavi||)
ĕvvaru sĕppina vinagiṁta sesugŏnĕ niṁti
puvvuvalĕ mannanalam̐ bodiseyavayyā
(||ĕvva||)
achchalāna sĕli nīyaṁḍa nuṁḍi pŏṁdu sesi
pachchisesugŏnĕ menu paḍam̐ti
vichchanaviḍi toḍane viḍĕmu nīsedigichchi
mĕchchulugā valabulu mĕḍam̐ gaṭṭugŏnĕnu
(||ĕvva||)
mŏgamoḍamulane movi nīgu viṁdu sĕppi
tagiliṁchugŏnĕ melu taruṇi
nagudāne nīrūbu nām̐ṭugŏnam̐ jūsi sūsi
taginaṁtam̐ danum̐ dāne tami rem̐sugŏnĕnu
(||ĕvva||)
aṁdabum̐ jannulanŏtti aṁṭam̐ gām̐giliṁchi kūḍi
kaṁduvadom̐ bĕṁḍlāḍĕm̐ galigi
saṁdaḍi śhrīveṁkaḍeśha sārĕ nīgu mŏkki mŏkki
aṁdĕṁdi paṭṭibudevu lanibiṁchugŏnĕnu