ఎవ్వరు సాకిరిచెప్పే రిందుకుఁగాఁ దనకు
(॥పల్లవి॥)
ఎవ్వరు సాకిరిచెప్పే రిందుకుఁగాఁ దనకు
వువ్విళూ(ళ్లూ?)రఁ దనలోనే వూహించుకొమ్మనవే
(॥ఎవ్వ॥)
మొగములోపలితేట ముందరనే కానరాఁగా
యెగసక్కెపురమణుఁ డేలబొంకీనే
తగిలి తనవన్నెలు తాఁ జూచుకోరాకుంటే
సొగిసి యద్దమైనానుఎ జూచుకొమ్మనవే
(॥ఎవ్వ॥)
లచ్చనగా నొసలను లత్తుక లంటుకుండగా
యిచ్చకములాడి విభుఎ డేలబొంకీనే
తచ్చి తనపై మచ్చము తాఎజూచుకోరాకుంటే
అచ్చలాన నద్దమైన నట్టె చూడుమనవే
(॥ఎవ్వ॥)
పెదివిపై మాణికేలు బిగువులువట్టుండఁగా
యెదుట శ్రీవేంకటేశుఁ డేలబొంకీనే
వదనము తాఁ జూడవసముగాకుంటే నద్దము
యిదె చూచుకొమ్మనవే యిట్టె నన్నుఁ గూడెను
(||pallavi||)
ĕvvaru sāgirisĕppe riṁdugum̐gām̐ danagu
vuvviḽū(ḽlū?)ram̐ danalone vūhiṁchugŏmmanave
(||ĕvva||)
mŏgamulobalideḍa muṁdarane kānarām̐gā
yĕgasakkĕburamaṇum̐ ḍelabŏṁkīne
tagili tanavannĕlu tām̐ jūsugorāguṁṭe
sŏgisi yaddamainānuĕ jūsugŏmmanave
(||ĕvva||)
lachchanagā nŏsalanu lattuga laṁṭuguṁḍagā
yichchagamulāḍi vibhuĕ ḍelabŏṁkīne
tachchi tanabai machchamu tǣjūsugorāguṁṭe
achchalāna naddamaina naṭṭĕ sūḍumanave
(||ĕvva||)
pĕdivibai māṇigelu biguvuluvaṭṭuṁḍam̐gā
yĕduḍa śhrīveṁkaḍeśhum̐ ḍelabŏṁkīne
vadanamu tām̐ jūḍavasamugāguṁṭe naddamu
yidĕ sūsugŏmmanave yiṭṭĕ nannum̐ gūḍĕnu