Evvaru ninnemaneru imta doddavaamdavu

ఎవ్వరు నిన్నేమనేరు ఇంత దొడ్డవాఁడవు
Language

(॥పల్లవి॥)
ఎవ్వరు నిన్నేమనేరు ఇంత దొడ్డవాఁడవు
చివ్వన నాపెచే సేవచేయించుకోరాదా

(॥॥)
జూటరితనము నేర్చు సుద్దులు చెప్పఁగనేర్చు
కూటమికి నాపె నిన్నుఁ గొసరనేర్చు
యేఁటికి బాఁతి నేను ఇచ్చకమాడేదానను
చోటిచ్చి యాపె నొద్దఁ గూచుండఁ బెట్టుకోరాదా

(॥॥)
సరసమాడఁగనోపు సన్నలు సేయఁగ నోపు
ఇరవుగా నాపె యెలయించఁగ నోపు
వొరయ నిందేమున్నది వూడిగపుదాన నేను
తెరవేసి నీసూటికి తిద్దుకొనరాదా

(॥॥)
వలపించ తానెరుఁగు వాడికలెల్లా నెరుఁగు
కలసి నిన్నా పె పొసఁగఁగ నెరుఁగు
యెలమి నన్నేలితివి యిప్పుడే శ్రీ వేంకటేశ
కలికి యాపెఁ బెద్దరికము సేయరాదా

(||pallavi||)
ĕvvaru ninnemaneru iṁta dŏḍḍavām̐ḍavu
sivvana nābĕse sevaseyiṁchugorādā

(||||)
jūḍaridanamu nersu suddulu sĕppam̐ganersu
kūḍamigi nābĕ ninnum̐ gŏsaranersu
yem̐ṭigi bām̐ti nenu ichchagamāḍedānanu
soḍichchi yābĕ nŏddam̐ gūsuṁḍam̐ bĕṭṭugorādā

(||||)
sarasamāḍam̐ganobu sannalu seyam̐ga nobu
iravugā nābĕ yĕlayiṁcham̐ga nobu
vŏraya niṁdemunnadi vūḍigabudāna nenu
tĕravesi nīsūḍigi tiddugŏnarādā

(||||)
valabiṁcha tānĕrum̐gu vāḍigalĕllā nĕrum̐gu
kalasi ninnā pĕ pŏsam̐gam̐ga nĕrum̐gu
yĕlami nannelidivi yippuḍe śhrī veṁkaḍeśha
kaligi yābĕm̐ bĕddarigamu seyarādā