Evvaru ninnaadugone rikkada ne numdamgaanu

ఎవ్వరు నిన్నాడుకొనే రిక్కడ నే నుండఁగాను
Language

(॥పల్లవి॥)
ఎవ్వరు నిన్నాడుకొనే రిక్కడ నే నుండఁగాను
అవ్వల నీమనోరథా లడిగి రావయ్యా

(॥॥)
పొలిఁతి మాటాలాడఁగా పోచిళ్లు చల్లితినంటా
వెలి నాలకించుకొంటా వినేవు నీవు
తలఁపు కొలఁది నాకె తారుకాణలే చెప్పె
ఫలించె సగినము లోపలికిఁ బోవయ్యా

(॥॥)
సరసా లాపేడఁగా సగినాలు చూచెనంటా
గొరబై పలుకు లెంచుకొనేవు నీవు
అరుదుగ నీవు గోరినటువలెనే కలసె
సరివచ్చె సగినము సంగడికిఁ బోవయ్యా

(॥॥)
ఆపెకతలు చెప్పఁగా నర్చించుకున్నాఁడంటా
జోకఁ బాటము సేసుక చొక్కేవు నీవు
యీకడ శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టె
యేకమాయ సగినము యింటికిఁ బోవయ్యా

(||pallavi||)
ĕvvaru ninnāḍugŏne rikkaḍa ne nuṁḍam̐gānu
avvala nīmanorathā laḍigi rāvayyā

(||||)
pŏlim̐ti māḍālāḍam̐gā posiḽlu sallidinaṁṭā
vĕli nālagiṁchugŏṁṭā vinevu nīvu
talam̐pu kŏlam̐di nāgĕ tārugāṇale sĕppĕ
phaliṁchĕ saginamu lobaligim̐ bovayyā

(||||)
sarasā lābeḍam̐gā saginālu sūsĕnaṁṭā
gŏrabai palugu lĕṁchugŏnevu nīvu
aruduga nīvu gorinaḍuvalĕne kalasĕ
sarivachchĕ saginamu saṁgaḍigim̐ bovayyā

(||||)
ābĕgadalu sĕppam̐gā narsiṁchugunnām̐ḍaṁṭā
jogam̐ bāḍamu sesuga sŏkkevu nīvu
yīgaḍa śhrī veṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
yegamāya saginamu yiṁṭigim̐ bovayyā