Evvaru ninnaadugone redi vemge mimdulona

ఎవ్వరు నిన్నాడుకొనే రేది వెంగె మిందులోన
Language

(॥పల్లవి॥)
ఎవ్వరు నిన్నాడుకొనే రేది వెంగె మిందులోన
రవ్వగా మొక్కఁగరాదా రచ్చలోన నీకును

(॥ఎవ్వ॥)
తగవరివౌదువు తప్పు నీయందేమిలేదు
నగరాదా వూరకె నాలోనను
వెగటు నీ కెక్కడిది వెరపు నీకిఁకనేల
మొగము చూడరాదా ముంచి నాకు నేఁడు

(॥ఎవ్వ॥)
పంతగాఁడ వొదువు బాససేసితే మీరవు
సంతోసించఁగరాదా సారెసారెకు
వింతవా రిందులో వేరీ; వేడుకచుట్టానే నీకు
మంతనమాడుకోరాదా మాలో మేము

(॥ఎవ్వ॥)
దయగలవాఁడవు తగ్గుముగ్గు లెరఁగవు
ప్రియము చెప్పఁగరాదా పెనఁగి నీకు
నియతి శ్రీవేంకటేశ నీవు నన్ను నేలితివి
నయము చూపఁగరాదా నంటుసేసి నీకు

(||pallavi||)
ĕvvaru ninnāḍugŏne redi vĕṁgĕ miṁdulona
ravvagā mŏkkam̐garādā rachchalona nīgunu

(||ĕvva||)
tagavarivauduvu tappu nīyaṁdemiledu
nagarādā vūragĕ nālonanu
vĕgaḍu nī kĕkkaḍidi vĕrabu nīgim̐kanela
mŏgamu sūḍarādā muṁchi nāgu nem̐ḍu

(||ĕvva||)
paṁtagām̐ḍa vŏduvu bāsaseside mīravu
saṁtosiṁcham̐garādā sārĕsārĕgu
viṁtavā riṁdulo verī; veḍugasuṭṭāne nīgu
maṁtanamāḍugorādā mālo memu

(||ĕvva||)
dayagalavām̐ḍavu taggumuggu lĕram̐gavu
priyamu sĕppam̐garādā pĕnam̐gi nīgu
niyadi śhrīveṁkaḍeśha nīvu nannu nelidivi
nayamu sūbam̐garādā naṁṭusesi nīgu