ఎవ్వరు నెఱఁగనివా యిటువంటి సుద్దులు
(॥పల్లవి॥)
ఎవ్వరు నెఱఁగనివా యిటువంటి సుద్దులు
నవ్వుల కేమో కాక ననుపయ్యేవాఁడవా
(॥ఎవ్వ॥)
యేతులకు నామీఁద నిటు చే వేసితి గాక
కాతరాన నీ వొకరిఁ గైకొందువా
రాతిటఁ బంటి యెవ్వతె రాకుండఁగాఁ గాక
యీతల నూతోడిపొందు వితవయ్యీనా
(॥ఎవ్వ॥)
అలవోకగా మాయింటి కటు విచ్చేసితి గాక
తలఁపున నీ కంతతమి వున్నదా
పిలిచి యెవ్వతె నీతోఁ బెనఁగకుండఁ గాఁ గాక
పెలుచునీమతి కింత ప్రియమయ్యేమా
(॥ఎవ్వ॥)
గక్కన దయఁదలఁచి కాఁగిటఁ గూడితి గాక
వెక్కసాన నీ కొకరు విన్నవించేరా
యెక్కువ శ్రీ వేంకటేశయిట్టె నన్నుఁ గూడితివి
పిక్కటిల్ల నీకు నాకు భేదమున్నదా
(||pallavi||)
ĕvvaru nĕṟam̐ganivā yiḍuvaṁṭi suddulu
navvula kemo kāga nanubayyevām̐ḍavā
(||ĕvva||)
yedulagu nāmīm̐da niḍu se vesidi gāga
kādarāna nī vŏgarim̐ gaigŏṁduvā
rādiḍam̐ baṁṭi yĕvvadĕ rāguṁḍam̐gām̐ gāga
yīdala nūdoḍibŏṁdu vidavayyīnā
(||ĕvva||)
alavogagā māyiṁṭi kaḍu vichchesidi gāga
talam̐puna nī kaṁtadami vunnadā
pilisi yĕvvadĕ nīdom̐ bĕnam̐gaguṁḍam̐ gām̐ gāga
pĕlusunīmadi kiṁta priyamayyemā
(||ĕvva||)
gakkana dayam̐dalam̐si kām̐giḍam̐ gūḍidi gāga
vĕkkasāna nī kŏgaru vinnaviṁcherā
yĕkkuva śhrī veṁkaḍeśhayiṭṭĕ nannum̐ gūḍidivi
pikkaḍilla nīgu nāgu bhedamunnadā