Evvaru nemi sepperu yiddaramum goodidimi

ఎవ్వరు నేమి చెప్పేరు యిద్దరముఁ గూడితిమి
Language

(॥పల్లవి॥)
ఎవ్వరు నేమి చెప్పేరు యిద్దరముఁ గూడితిమి
ఇవ్వల నీవే నాకు నియ్యవయ్య విడెము

(॥ఎవ్వ॥)
మాపుదాఁకా నీతోడ మాటకు మాటాడఁ బోతే
యేపు మీఱ యిఁకనవి యెన్నిలేవు
కోపమెల్లాఁ దీరె నాకు కొప్పు నీవు దువ్వితేనే
రాపులఁ బెట్టక ఇఁక రావయ్య లోనికి

(॥ఎవ్వ॥)
బిగియుచు నీతోను పెనఁగులాడఁ జూచితే
యెగసక్కెములు మరి యెన్నిలేవు
చిగిరించె నామనసు చేయి నీవు చాఁచితేనే
అగడు సేయక వేయవయ్య తెర యిఁకను

(॥ఎవ్వ॥)
రాతిరిఁ బగలు నీతో రతులు తోడుచూపితే
యేతుల యెన్నికలకు నెన్నిలేవు
యీతల శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టే
కాతరానఁ బచ్చడము గప్పవయ్య ఇప్పుడు

(||pallavi||)
ĕvvaru nemi sĕpperu yiddaramum̐ gūḍidimi
ivvala nīve nāgu niyyavayya viḍĕmu

(||ĕvva||)
mābudām̐kā nīdoḍa māḍagu māḍāḍam̐ bode
yebu mīṟa yim̐kanavi yĕnnilevu
kobamĕllām̐ dīrĕ nāgu kŏppu nīvu duvvidene
rābulam̐ bĕṭṭaga im̐ka rāvayya lonigi

(||ĕvva||)
bigiyusu nīdonu pĕnam̐gulāḍam̐ jūside
yĕgasakkĕmulu mari yĕnnilevu
sigiriṁchĕ nāmanasu seyi nīvu sām̐sidene
agaḍu seyaga veyavayya tĕra yim̐kanu

(||ĕvva||)
rādirim̐ bagalu nīdo radulu toḍusūbide
yedula yĕnnigalagu nĕnnilevu
yīdala śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭe
kādarānam̐ bachchaḍamu gappavayya ippuḍu