Evvaru nemi sepperu imtigi raavayyaa neevu

ఎవ్వరు నేమి చెప్పేరు ఇంటికి రావయ్యా నీవు
Language

(॥పల్లవి॥)
ఎవ్వరు నేమి చెప్పేరు ఇంటికి రావయ్యా నీవు
పువ్వునుఁ బిందెయువలె పొసఁగివున్నారము

(॥ఎవ్వ॥)
మనసునఁబట్టితే మరి దేహము గరఁగు
తనువు సోఁకితేనే చిత్తము గరఁగు
వొనరి తలఁచుకొంటే వొకటొకటికి లంకె
మనలోన నట్లానేకా మరిగివున్నారము

(॥ఎవ్వ॥)
మొగము చూచితేనే మొలకనవ్వులు వుట్టు
నగవుఁజూపులనే మొగమోడును
తగి యారెంటికి సరిదాఁకి యుండునట్లానే
బిగువుఁగాఁగిళ్ల నిట్టె బెరసివున్నారము

(॥ఎవ్వ॥)
సేసచేయి చాఁచితేనే చిమ్మిరేఁగుఁ దమకము
ఆసఁ దమకము చేతికందిచ్చు రతి
తాసువంటి వివి రెండు దక్కెను శ్రీవేంకటేశ
వాసితోఁ గూడితి మింత వలచివున్నారము

(||pallavi||)
ĕvvaru nemi sĕpperu iṁṭigi rāvayyā nīvu
puvvunum̐ biṁdĕyuvalĕ pŏsam̐givunnāramu

(||ĕvva||)
manasunam̐baṭṭide mari dehamu garam̐gu
tanuvu som̐kidene sittamu garam̐gu
vŏnari talam̐sugŏṁṭe vŏgaḍŏgaḍigi laṁkĕ
manalona naṭlānegā marigivunnāramu

(||ĕvva||)
mŏgamu sūsidene mŏlaganavvulu vuṭṭu
nagavum̐jūbulane mŏgamoḍunu
tagi yārĕṁṭigi saridām̐ki yuṁḍunaṭlāne
biguvum̐gām̐giḽla niṭṭĕ bĕrasivunnāramu

(||ĕvva||)
sesaseyi sām̐sidene simmirem̐gum̐ damagamu
āsam̐ damagamu sedigaṁdichchu radi
tāsuvaṁṭi vivi rĕṁḍu dakkĕnu śhrīveṁkaḍeśha
vāsidom̐ gūḍidi miṁta valasivunnāramu