Evvaru nemi seppere yimtulu neegu

ఎవ్వరు నేమి చెప్పేరే యింతులు నీకు
Language

(॥పల్లవి॥)
ఎవ్వరు నేమి చెప్పేరే యింతులు నీకు
జవ్వనిరో యిద్దరును జంటనుంటే మేలు

(॥ఎవ్వ॥)
యెనసినచోటికిని యెగ్గుదప్పు లెంచనేల
చనవి మనవితోడిసంతమే మేలు
ననువుగలచోటికి నాయాలకుఁ బనిలేదు
తనలోనే సంతసించె తగుపొందే మేలు

(॥ఎవ్వ॥)
ఆయములంటినచోటి కనుమానా లిఁకనేల
పాయముతోఁ గరఁగేటిబాగులే మేలు
పాయరానివావులకుఁ బరుల నడుగనేల
చేయిచేతఁ బుట్టినట్టిచెనకులే మేలు

(॥ఎవ్వ॥)
వలచినచోటికి వాసివంతు లిఁకనేల
బలిమి చూపక కిందుపడుటే మేలు
యెలమి శ్రీ వేంకటేశు నిప్పు డిట్టె కూడితివి
చలము దీరెను మీలో సమ్మతులే మేలు

(||pallavi||)
ĕvvaru nemi sĕppere yiṁtulu nīgu
javvaniro yiddarunu jaṁṭanuṁṭe melu

(||ĕvva||)
yĕnasinasoḍigini yĕggudappu lĕṁchanela
sanavi manavidoḍisaṁtame melu
nanuvugalasoḍigi nāyālagum̐ baniledu
tanalone saṁtasiṁchĕ tagubŏṁde melu

(||ĕvva||)
āyamulaṁṭinasoḍi kanumānā lim̐kanela
pāyamudom̐ garam̐geḍibāgule melu
pāyarānivāvulagum̐ barula naḍuganela
seyisedam̐ buṭṭinaṭṭisĕnagule melu

(||ĕvva||)
valasinasoḍigi vāsivaṁtu lim̐kanela
balimi sūbaga kiṁdubaḍuḍe melu
yĕlami śhrī veṁkaḍeśhu nippu ḍiṭṭĕ kūḍidivi
salamu dīrĕnu mīlo sammadule melu