ఎవ్వరు నేమి సేతురు యేల దూరేవు చెలుల
(॥పల్లవి॥)
ఎవ్వరు నేమి సేతురు యేల దూరేవు చెలుల
జవ్వన మిదెకద చవులు పుట్టించేది
(॥॥)
కనుచూపులేకద కమ్మరఁ గమ్మర లోలో
పొనుగకుండా నాలు పుట్టించేవి
వినుకలి యిదెకద వెక్కసమై వలపించి
తనవోనితమకము దైలువారించేది
(॥॥)
ఆడేటిమాటలేకద ఆయములు సోఁకించి
వేడుకలు మీఁదమీఁద వెలఇంచేవి
కూడినకూటమేకద గుణములు పెడఁ రేచి
వాడికలు నెలకొల్పి వసముచేసేవి
(॥॥)
సరసములివేకద సమ్మతులుగాఁ జేసి
బిరుదుకాఁగిటిలోనఁ బెనఁగించేవి
యిరవై శ్రీవేంకటేశుఁ డేలె నిన్ను నింతతోనె
గొరబుగుఱులేకద కొనలు సాగించేవి
(||pallavi||)
ĕvvaru nemi seduru yela dūrevu sĕlula
javvana midĕgada savulu puṭṭiṁchedi
(||||)
kanusūbulegada kammaram̐ gammara lolo
pŏnugaguṁḍā nālu puṭṭiṁchevi
vinugali yidĕgada vĕkkasamai valabiṁchi
tanavonidamagamu dailuvāriṁchedi
(||||)
āḍeḍimāḍalegada āyamulu som̐kiṁchi
veḍugalu mīm̐damīm̐da vĕla̮iṁchevi
kūḍinagūḍamegada guṇamulu pĕḍam̐ resi
vāḍigalu nĕlagŏlbi vasamusesevi
(||||)
sarasamulivegada sammadulugām̐ jesi
birudugām̐giḍilonam̐ bĕnam̐giṁchevi
yiravai śhrīveṁkaḍeśhum̐ ḍelĕ ninnu niṁtadonĕ
gŏrabuguṟulegada kŏnalu sāgiṁchevi