Evvaru nannuddharimche rimtada veṟavagu mani

ఎవ్వరు నన్నుద్ధరించే రింతట వెఱవకు మని
Language

(॥పల్లవి॥)
ఎవ్వరు నన్నుద్ధరించే రింతట వెఱవకు మని
అవ్వల నివ్వల శ్రీహరియే కాక

(॥ఎవ్వ॥)
రాపులఁ బంచేంద్రియపు రాచపైరు మేయఁగాను
పాపపుణ్యమనేటి బందెఁ జిక్కితి
వోపి సంసారమనే వొందముపై నడవఁగాను
కూపపు జన్మముపాలై కూయుచు నున్నాఁడను

(॥ఎవ్వ॥)
ఆసలనేటి పెద్ద అంగిటిగాలాల మింగి
కోనేటి మాయ వంటింటికుందేలు నైతి
బాస దప్పి చిత్తమనే బండారము గొల్లలాడి
లాసి కామాదులనే తలారుల చేపడితి

(॥ఎవ్వ॥)
కాంతల మోహమనేటి కారడవిలోఁ జిక్కి
అంతట విజ్ఞానమార్గ మటు దప్పితి
యింతలో శ్రీవేంకటేశు నెఱిఁగించె మా గురుఁడు
మంతు కెక్కించఁగ నేను మంచి మేలు గంటి

(||pallavi||)
ĕvvaru nannuddhariṁche riṁtaḍa vĕṟavagu mani
avvala nivvala śhrīhariye kāga

(||ĕvva||)
rābulam̐ baṁcheṁdriyabu rāsabairu meyam̐gānu
pābabuṇyamaneḍi baṁdĕm̐ jikkidi
vobi saṁsāramane vŏṁdamubai naḍavam̐gānu
kūbabu janmamubālai kūyusu nunnām̐ḍanu

(||ĕvva||)
āsalaneḍi pĕdda aṁgiḍigālāla miṁgi
koneḍi māya vaṁṭiṁṭiguṁdelu naidi
bāsa dappi sittamane baṁḍāramu gŏllalāḍi
lāsi kāmādulane talārula sebaḍidi

(||ĕvva||)
kāṁtala mohamaneḍi kāraḍavilom̐ jikki
aṁtaḍa vijñānamārga maḍu dappidi
yiṁtalo śhrīveṁkaḍeśhu nĕṟim̐giṁchĕ mā gurum̐ḍu
maṁtu kĕkkiṁcham̐ga nenu maṁchi melu gaṁṭi