Evvaru naagu dikku yemani seppudu nimka

ఎవ్వరు నాకు దిక్కు యేమని చెప్పుదు నిఁక
Language

(॥పల్లవి॥)
ఎవ్వరు నాకు దిక్కు యేమని చెప్పుదు నిఁక
అవ్వలికి నివ్వలికి హరి నీవే కాకా

(॥ఎవ్వరు॥)
యెన్నటిప్రతిబంధమో యెంచఁ గామక్రోధములు
వెన్నాడి నేఁ బుట్టితేనే వెంటఁ బుట్టీని
మున్నిటికొల మెట్టిదో మొగి మదమత్సరము
లన్నిలోకములఁ జొచ్చి నందుఁ జొచ్చీని

(॥ఎవ్వరు॥)
యెక్కడి ఋణమో నాకు నీ దేహభోగములు
పక్కన నేడనుండినా బడివాయవు
తక్క కేనాటికర్మమో తగఁ బుణ్యపాపములు
చిక్కులై కలలోనఁ జిమ్మి రేఁచీని

(॥ఎవ్వరు॥)
యెందరిపగో కాని యీ తమోరాజసములు
సందడించి చలములు సాదించీని
యిందునే శ్రీవేంకటేశ యింతలో నన్నేలితివి
కిందుపడి యీవే నన్ను గెలిపించీని

(||pallavi||)
ĕvvaru nāgu dikku yemani sĕppudu nim̐ka
avvaligi nivvaligi hari nīve kāgā

(||ĕvvaru||)
yĕnnaḍipradibaṁdhamo yĕṁcham̐ gāmakrodhamulu
vĕnnāḍi nem̐ buṭṭidene vĕṁṭam̐ buṭṭīni
munniḍigŏla mĕṭṭido mŏgi madamatsaramu
lannilogamulam̐ jŏchchi naṁdum̐ jŏchchīni

(||ĕvvaru||)
yĕkkaḍi ṛṇamo nāgu nī dehabhogamulu
pakkana neḍanuṁḍinā baḍivāyavu
takka kenāḍigarmamo tagam̐ buṇyabābamulu
sikkulai kalalonam̐ jimmi rem̐sīni

(||ĕvvaru||)
yĕṁdaribago kāni yī tamorājasamulu
saṁdaḍiṁchi salamulu sādiṁchīni
yiṁdune śhrīveṁkaḍeśha yiṁtalo nannelidivi
kiṁdubaḍi yīve nannu gĕlibiṁchīni