ఎవ్వరు మంచివారమో యెంచుకో నీవు
(॥పల్లవి॥)
ఎవ్వరు మంచివారమో యెంచుకో నీవు
జవ్వనుల మిద్దరము సవతులమే
(॥ఎవ్వ॥)
మచ్చిక నీకుఁ జేసి మంతనాన నిన్ను రాసి
పెచ్చువేరిగాకె నిన్నుఁ బెండ్లాడెను
యిచ్చకములే యాడి యిన్నిపనులూఁ జేసి
మెచ్చులుమెచ్చి సేస నీమీఁద నేఁ బెట్టితిని
(॥ఎవ్వ॥)
చెలులచేఁ జెప్పిపంపి చేతుల నిన్నుఁ జెనకి
అలమి బలిమి నిట్టే యాపె గూడెను
పిలిచి నీకు నేను ప్రియములెల్లాఁ జెప్పి
తలంపులు సరిదాఁక తమితోఁ గూడితిని
(॥ఎవ్వ॥)
కన్నులఁ దప్పకచూచి కడు బాసగొని యాకె
సన్నసేసి నీమోవి చవిగొనెను
విన్నపాలు నేనే సేసి వేడుకొని చెక్కునొక్కి
యిన్నిటా శ్రీవేంకటేశ యెనసితి నేను
(||pallavi||)
ĕvvaru maṁchivāramo yĕṁchugo nīvu
javvanula middaramu savadulame
(||ĕvva||)
machchiga nīgum̐ jesi maṁtanāna ninnu rāsi
pĕchchuverigāgĕ ninnum̐ bĕṁḍlāḍĕnu
yichchagamule yāḍi yinnibanulūm̐ jesi
mĕchchulumĕchchi sesa nīmīm̐da nem̐ bĕṭṭidini
(||ĕvva||)
sĕlulasem̐ jĕppibaṁpi sedula ninnum̐ jĕnagi
alami balimi niṭṭe yābĕ gūḍĕnu
pilisi nīgu nenu priyamulĕllām̐ jĕppi
talaṁpulu saridām̐ka tamidom̐ gūḍidini
(||ĕvva||)
kannulam̐ dappagasūsi kaḍu bāsagŏni yāgĕ
sannasesi nīmovi savigŏnĕnu
vinnabālu nene sesi veḍugŏni sĕkkunŏkki
yinniḍā śhrīveṁkaḍeśha yĕnasidi nenu