Evvaru jaanale veeriddarilona

ఎవ్వరు జాణలే వీరిద్దరిలోన
Language

(॥పల్లవి॥)
ఎవ్వరు జాణలే వీరిద్దరిలోన
రవ్వలు మాయలుసేసీ రాజసపు కృష్ణుఁడు

(॥ఎవ్వ॥)
దోసిట నీరు నించె తొయ్యలి మోము గడిగె
ఆసమయాన కృష్ణుఁడు అటు వెనకనుండఁగా
వోసరి యాతనినీడ దోసిటిలోఁ గని నీరు
వాసి గాళ్లఁజల్లుకోఁగా వడి నవ్వె కృష్ణుఁడు

(॥ఎవ్వ॥)
అద్దము చూచి నామ మటు దీర్చుచును ఇంతి
వొద్దనే మానిమీఁదనున్నకృష్ణు నందుఁ గని
అద్దము తామరగొని యడిచిన నది చూచి
చద్దికి వేఁడికి నవ్వి జంకించెఁ కృష్ణుఁడు

(॥ఎవ్వ॥)
నిక్కపుపూలు గోయుచు నీరెండగాయఁగాను
పక్కన కృష్ణునినీడ పడఁతి గని
అక్కడ నేతెంచి వద్దియంగనఁ గూడఁగాను
వెక్కసాన మెచ్చెను శ్రీవేంకటాద్రి కృష్ణుఁడు

(||pallavi||)
ĕvvaru jāṇale vīriddarilona
ravvalu māyalusesī rājasabu kṛṣhṇum̐ḍu

(||ĕvva||)
dosiḍa nīru niṁchĕ tŏyyali momu gaḍigĕ
āsamayāna kṛṣhṇum̐ḍu aḍu vĕnaganuṁḍam̐gā
vosari yādaninīḍa dosiḍilom̐ gani nīru
vāsi gāḽlam̐jallugom̐gā vaḍi navvĕ kṛṣhṇum̐ḍu

(||ĕvva||)
addamu sūsi nāma maḍu dīrsusunu iṁti
vŏddane mānimīm̐danunnakṛṣhṇu naṁdum̐ gani
addamu tāmaragŏni yaḍisina nadi sūsi
saddigi vem̐ḍigi navvi jaṁkiṁchĕm̐ kṛṣhṇum̐ḍu

(||ĕvva||)
nikkabubūlu goyusu nīrĕṁḍagāyam̐gānu
pakkana kṛṣhṇuninīḍa paḍam̐ti gani
akkaḍa nedĕṁchi vaddiyaṁganam̐ gūḍam̐gānu
vĕkkasāna mĕchchĕnu śhrīveṁkaḍādri kṛṣhṇum̐ḍu