Evvaru galiginaanu yimta neraru

ఎవ్వరు గలిగినాను యింత నేరరు
Language

(॥పల్లవి॥)
ఎవ్వరు గలిగినాను యింత నేరరు
నివ్వటిల్లిన దొరవు నీవౌదువే

(॥ఎవ్వ॥)
మఱి వలసించితివి మచ్చితో రమణుని
మెఱసి నేర్పరులలోమేఁటివౌదువే
వెఱ సించుకంతా లేక వెంటవెంటఁ దిప్పితివి
నెఱతనపుజాణవు నీవౌదువే

(॥ఎవ్వ॥)
చొక్కించి విభునిమేనిసౌ మ్మిప్పించుకొంటివి
నెక్కొన్నబాగ్యజీవిని నీవౌదువే
చెక్కునొక్కి నీపనులు సేయించుకొంటివి
నిక్కముఁబంతకత్తెవు నీవౌదువే

(॥ఎవ్వ॥)
ఇయ్యెడ శ్రీవేంకేటేశు నిన్నిటానుఁ గూడితివి
నెయ్యపువాసికత్తెవు నీవౌదువే
వొయ్యనే అతని నన్ను నొనగూరిచితి విట్టె
నియ్యందే దయగలదు నీవౌదువే

(||pallavi||)
ĕvvaru galiginānu yiṁta neraru
nivvaḍillina dŏravu nīvauduve

(||ĕvva||)
maṟi valasiṁchidivi machchido ramaṇuni
mĕṟasi nerbarulalomem̐ṭivauduve
vĕṟa siṁchugaṁtā lega vĕṁṭavĕṁṭam̐ dippidivi
nĕṟadanabujāṇavu nīvauduve

(||ĕvva||)
sŏkkiṁchi vibhunimenisau mmippiṁchugŏṁṭivi
nĕkkŏnnabāgyajīvini nīvauduve
sĕkkunŏkki nībanulu seyiṁchugŏṁṭivi
nikkamum̐baṁtagattĕvu nīvauduve

(||ĕvva||)
iyyĕḍa śhrīveṁkeḍeśhu ninniḍānum̐ gūḍidivi
nĕyyabuvāsigattĕvu nīvauduve
vŏyyane adani nannu nŏnagūrisidi viṭṭĕ
niyyaṁde dayagaladu nīvauduve