ఎవ్వరు గలరీతని కిఁక నేమిటికిని వెరవకు మన
(॥పల్లవి॥)
ఎవ్వరు గలరీతని కిఁక నేమిటికిని వెరవకు మన-
నెవ్వరు??? గల రాత్మరక్ష యేప్రొద్దునుఁ జేయను
(॥ఎవ్వరు॥)
పసిబాలకు బండివిరిగి పడి మేనెల్ల నొచ్చెను
కసుగందుకు నీరుపాముకాటున మై గందెను
నసికొట్లఁగోడెచేత నరుమాయను శిశువింతయు
వసముగాని చను ద్రావినవలనఁ బాపఁడు వాడెను
(॥ఎవ్వరు॥)
పెనుమాఁకుల పైపాటున బెదరి వెరచెఁ బిన్నవాఁడు
ఘనమగు సుడిగాలి దాఁకి కనుమూయనోపఁడు
అనువున వేంకటగిరిపై నన్నిసంకటములుఁ బాసి
మునిజనముల గేహముననుండెడి దేవుఁడు
(||pallavi||)
ĕvvaru galarīdani kim̐ka nemiḍigini vĕravagu mana-
nĕvvaru??? gala rātmarakṣha yeprŏddunum̐ jeyanu
(||ĕvvaru||)
pasibālagu baṁḍivirigi paḍi menĕlla nŏchchĕnu
kasugaṁdugu nīrubāmugāḍuna mai gaṁdĕnu
nasigŏṭlam̐goḍĕseda narumāyanu śhiśhuviṁtayu
vasamugāni sanu drāvinavalanam̐ bābam̐ḍu vāḍĕnu
(||ĕvvaru||)
pĕnumām̐kula paibāḍuna bĕdari vĕrasĕm̐ binnavām̐ḍu
ghanamagu suḍigāli dām̐ki kanumūyanobam̐ḍu
anuvuna veṁkaḍagiribai nannisaṁkaḍamulum̐ bāsi
munijanamula gehamunanuṁḍĕḍi devum̐ḍu