ఎవ్వరు బుద్దులు చెప్పే రీతని కిఁక
(॥పల్లవి॥)
ఎవ్వరు బుద్దులు చెప్పే రీతని కిఁక
కవ్వ కవ నవ్వీ లోకము మెచ్చవలదా
(॥ఎవ్వ॥)
వొక్క టొక్కటె గడించి వూరికె తా ముట్టుకొని
చక్కఁగానే మాటలాడీ జాణఁడే వీఁడు
తెక్కులతో నింటివారు తిరిగి రా నుండఁగానే
చెక్కు నొక్కి సన్న సేసీ సిగ్గువడ వలదా
(॥ఎవ్వ॥)
చేరి విడె మిచ్చీని చేతులు పై జాఁచీని
సారెకు నానలువెటీప జాణఁడే వీఁడు
వెరతోపన నిందరు ముగ లాడఁగానే
ఆరసి పకొనీ కొంత ఆచారము వలదా
(॥ఎవ్వ॥)
యీపొద్దు నామంచ మెక్కి యెంతకాకు సేసీని
చాపలపగుణములజాణఁడే వీఁడు
యేపన శ్రీ వేంకటేశుఁ డీతఁ డిట్టె నన్నుఁగూడె
యీపాటివాఁడు గుట్టు ఇంచుకైనా వలదా
(||pallavi||)
ĕvvaru buddulu sĕppe rīdani kim̐ka
kavva kava navvī logamu mĕchchavaladā
(||ĕvva||)
vŏkka ṭŏkkaḍĕ gaḍiṁchi vūrigĕ tā muṭṭugŏni
sakkam̐gāne māḍalāḍī jāṇam̐ḍe vīm̐ḍu
tĕkkulado niṁṭivāru tirigi rā nuṁḍam̐gāne
sĕkku nŏkki sanna sesī sigguvaḍa valadā
(||ĕvva||)
seri viḍĕ michchīni sedulu pai jām̐sīni
sārĕgu nānaluvĕḍība jāṇam̐ḍe vīm̐ḍu
vĕradobana niṁdaru muga lāḍam̐gāne
ārasi pagŏnī kŏṁta āsāramu valadā
(||ĕvva||)
yībŏddu nāmaṁcha mĕkki yĕṁtagāgu sesīni
sābalabaguṇamulajāṇam̐ḍe vīm̐ḍu
yebana śhrī veṁkaḍeśhum̐ ḍīdam̐ ḍiṭṭĕ nannum̐gūḍĕ
yībāḍivām̐ḍu guṭṭu iṁchugainā valadā