Evvaru buddi seppinaa nela maanevu

ఎవ్వరు బుద్ది చెప్పినా నేల మానేవు
Language

(॥పల్లవి॥)
ఎవ్వరు బుద్ది చెప్పినా నేల మానేవు
పువ్వుల వేట్లు మీకు పోదులాయను

(॥ఎవ్వ॥)
చొచ్చి నీయిల్లాపె తోఁగి చూడఁగాను వేడుకాయ
వచ్చి వచ్చి మాటాడఁగా వాడికాయను
తచ్చి మీఇద్దరిలోనా దాఁటరాని పొందులాయ
నిచ్చలు మీమోవితేనె నిండువిందు లాయను

(॥ఎవ్వ॥)
రసికతఁ బెనఁగఁగా రతులకుఁ జోటులాయ
వసంతములో గందపువాటు లాయను
దొసఁగుఁగొప్పులు వీడి తుమ్మిదలమూక లాయ
ససు లొత్తి వలపులు సరియాఁక లాయను

(॥ఎవ్వ॥)
చెలఁగి కాఁగిలించఁగా చెమటలరొచ్చు లాయ
మెలుపునఁ గూడఁగాను మెచ్చు లాయను
యెలమి శ్రీ వేంకటేశ యిట్టె నన్ను నేలితివి
తలపోఁత లాయ నీచేతలే వూఁత లాయను

(||pallavi||)
ĕvvaru buddi sĕppinā nela mānevu
puvvula veṭlu mīgu podulāyanu

(||ĕvva||)
sŏchchi nīyillābĕ tom̐gi sūḍam̐gānu veḍugāya
vachchi vachchi māḍāḍam̐gā vāḍigāyanu
tachchi mīiddarilonā dām̐ṭarāni pŏṁdulāya
nichchalu mīmovidenĕ niṁḍuviṁdu lāyanu

(||ĕvva||)
rasigadam̐ bĕnam̐gam̐gā radulagum̐ joḍulāya
vasaṁtamulo gaṁdabuvāḍu lāyanu
dŏsam̐gum̐gŏppulu vīḍi tummidalamūga lāya
sasu lŏtti valabulu sariyām̐ka lāyanu

(||ĕvva||)
sĕlam̐gi kām̐giliṁcham̐gā sĕmaḍalarŏchchu lāya
mĕlubunam̐ gūḍam̐gānu mĕchchu lāyanu
yĕlami śhrī veṁkaḍeśha yiṭṭĕ nannu nelidivi
talabom̐ta lāya nīsedale vūm̐ta lāyanu