ఎవ్వరు బలులో చూత మిద్దరిలోనా
(॥పల్లవి॥)
ఎవ్వరు బలులో చూత మిద్దరిలోనా
నివ్వటిల్ల నేరుపులు నేరుతువు నీవు
(॥ఎవ్వ॥)
పలుకులనే నిన్ను బయలీఁదించీఁ జెలి
కలికితనాల మతి గరఁగించీని
నిలువుఁగొలువుసేసి నిన్నుఁ గడునెలయించీ
కెలసి నీవీపె నెట్టు గెలిచేవో కాని
(॥ఎవ్వ॥)
చుట్టరికాలనే నిన్నుఁ జొక్కులఁబెట్టి జెలి
ఱట్టడిచేఁతల నిన్నాఱడిసేసీని
గుట్టుతో నవ్వులు నవ్వి కోరి నిన్నాసలముంచీ
యెట్టు నీ వీపెతోఁ బంతా లెక్కించేవో కాని
(॥ఎవ్వ॥)
అందపుఁజూపుల నిన్ను నాసలఁదేలించీఁ జెలి
సందడినే మోవి చూపి చవిరేఁచీని
విందువలె నన్నును శ్రీవేంకటేశ కూడితివి
మందలించి యాపె నెట్టు మరిపేవో కాని
(||pallavi||)
ĕvvaru balulo sūda middarilonā
nivvaḍilla nerubulu neruduvu nīvu
(||ĕvva||)
palugulane ninnu bayalīm̐diṁchīm̐ jĕli
kaligidanāla madi garam̐giṁchīni
niluvum̐gŏluvusesi ninnum̐ gaḍunĕlayiṁchī
kĕlasi nīvībĕ nĕṭṭu gĕlisevo kāni
(||ĕvva||)
suṭṭarigālane ninnum̐ jŏkkulam̐bĕṭṭi jĕli
ṟaṭṭaḍisem̐tala ninnāṟaḍisesīni
guṭṭudo navvulu navvi kori ninnāsalamuṁchī
yĕṭṭu nī vībĕdom̐ baṁtā lĕkkiṁchevo kāni
(||ĕvva||)
aṁdabum̐jūbula ninnu nāsalam̐deliṁchīm̐ jĕli
saṁdaḍine movi sūbi savirem̐sīni
viṁduvalĕ nannunu śhrīveṁkaḍeśha kūḍidivi
maṁdaliṁchi yābĕ nĕṭṭu maribevo kāni