ఎవ్వరూఁ దమంతనుంటే నేలవచ్చీ నింతేసి
(॥పల్లవి॥)
ఎవ్వరూఁ దమంతనుంటే నేలవచ్చీ నింతేసి
దవ్వుల నుండినవారిఁ దడవఁ బొయ్యేరా
(॥ఎవ్వ॥)
మామాట లాడఁగాఁబో మరుముద్ర మోవి కెక్కె
కేరడానఁ జూడఁగాఁబో కెంపులెక్కెను
తారుకాణకు రాఁగాఁబో తనువెల్లాఁ బచ్చిదోఁచె
యీరు దియ్యఁ బేను వచ్చె నింతలోనే విభుఁడా
(॥ఎవ్వ॥)
నాలిఁ దలవంచఁగానబో నవ్వులు సెలవికెక్కె
నీలీల వంక నేపో నింద వచ్చేను
కైలాటాలు వెట్టఁగాఁబో కాఁకల నీ మేను చిక్కె
మూల నున్న వారినేల ముంగిట వేసేరా
(॥ఎవ్వ॥)
కాఁగిటికి రాఁగా నేపో కడువాసనలు మించె
చేఁగ సరసాననేపో జీరనారెను
వీఁగుచు శ్రీ వేంకటేశ వేడుకఁ గూడితి నన్ను
వేఁగగ యిట్లనే వుంటే వేరులు సేసేరా
(||pallavi||)
ĕvvarūm̐ damaṁtanuṁṭe nelavachchī niṁtesi
davvula nuṁḍinavārim̐ daḍavam̐ bŏyyerā
(||ĕvva||)
māmāḍa lāḍam̐gām̐bo marumudra movi kĕkkĕ
keraḍānam̐ jūḍam̐gām̐bo kĕṁpulĕkkĕnu
tārugāṇagu rām̐gām̐bo tanuvĕllām̐ bachchidom̐sĕ
yīru diyyam̐ benu vachchĕ niṁtalone vibhum̐ḍā
(||ĕvva||)
nālim̐ dalavaṁcham̐gānabo navvulu sĕlavigĕkkĕ
nīlīla vaṁka nebo niṁda vachchenu
kailāḍālu vĕṭṭam̐gām̐bo kām̐kala nī menu sikkĕ
mūla nunna vārinela muṁgiḍa veserā
(||ĕvva||)
kām̐giḍigi rām̐gā nebo kaḍuvāsanalu miṁchĕ
sem̐ga sarasānanebo jīranārĕnu
vīm̐gusu śhrī veṁkaḍeśha veḍugam̐ gūḍidi nannu
vem̐gaga yiṭlane vuṁṭe verulu seserā