Evvaroo nemisepperu yela bayaleemdimchevu

ఎవ్వరూ నేమిచెప్పేరు యేల బయలీఁదించేవు
Language

(॥పల్లవి॥)
ఎవ్వరూ నేమిచెప్పేరు యేల బయలీఁదించేవు
చివ్వన నా విన్నపము చిత్తగించవయ్యా

(॥ఎవ్వ॥)
సూటిగా నేఁ జూచేచూపులకు నీవు గురి
నీటున నీపొందులకు నేనే గురి
జూటవై నామన సింత సోదించ నేమున్నది
మాటలిన్నీ నాడ నేల మన్నించవయ్యా

(॥ఎవ్వ॥)
వరుసతో నీకు నేను వలచుట నాపాలు
నిరతి జనవిచ్చేది నీపాలు
పొరిఁబొరి సేసవెట్టి పొంతనాలు చూడనేల
తిరి వచ్చె నన్ను నిట్టె దయఁజూడవయ్యా

(॥ఎవ్వ॥)
యెగ్గులేక సేవసేయు టిదియే నాకు సెలవు
నిగ్గుల సిగ్గుదేర్చుట నీకు సెలవు
అగ్గమై శ్రీవేంకటేశ అలమేల్‌మంగపతివి
కగ్గులేక కూడితివి కరుణించవయ్యా

(||pallavi||)
ĕvvarū nemisĕpperu yela bayalīm̐diṁchevu
sivvana nā vinnabamu sittagiṁchavayyā

(||ĕvva||)
sūḍigā nem̐ jūsesūbulagu nīvu guri
nīḍuna nībŏṁdulagu nene guri
jūḍavai nāmana siṁta sodiṁcha nemunnadi
māḍalinnī nāḍa nela manniṁchavayyā

(||ĕvva||)
varusado nīgu nenu valasuḍa nābālu
niradi janavichchedi nībālu
pŏrim̐bŏri sesavĕṭṭi pŏṁtanālu sūḍanela
tiri vachchĕ nannu niṭṭĕ dayam̐jūḍavayyā

(||ĕvva||)
yĕggulega sevaseyu ṭidiye nāgu sĕlavu
niggula siggudersuḍa nīgu sĕlavu
aggamai śhrīveṁkaḍeśha alamel‌maṁgabadivi
kaggulega kūḍidivi karuṇiṁchavayyā