(॥పల్లవి॥)
ఎవ్వరివంకా నే మున్నది
నవ్వుచు నీశ్వర ననుఁ గావఁ గదే
(॥ఎవ్వరి॥)
ప్రతిబంధములకుఁ బంత మిచ్చితిని
రతి నా తెరు విఁక రాకు మని
గతిమాలి మాయకు కడు వీఁ పొగ్గితి
మతి నను నేఁపక మన్నించు మనుచు
(॥ఎవ్వరి॥)
చెప్పితిఁ బ్రియములు చిత్రగుప్తునకు
తప్పక కవెలలు దాచు మని
ముప్పిరి మొక్కితి మునుపనే మనసుకు
యెప్పుడుఁ గదలకు నేగకు మనుచు
(॥ఎవ్వరి॥)
వూరడించితిని వొడఁబరచి నిద్రను
సారె నేమరించకు మనుచు
యీరీతి శ్రీవేంకటేశ యలసితిని
చేరి నన్నుఁ గృప సేయఁగదే
(||pallavi||)
ĕvvarivaṁkā ne munnadi
navvusu nīśhvara nanum̐ gāvam̐ gade
(||ĕvvari||)
pradibaṁdhamulagum̐ baṁta michchidini
radi nā tĕru vim̐ka rāgu mani
gadimāli māyagu kaḍu vīm̐ pŏggidi
madi nanu nem̐paga manniṁchu manusu
(||ĕvvari||)
sĕppidim̐ briyamulu sitraguptunagu
tappaga kavĕlalu dāsu mani
muppiri mŏkkidi munubane manasugu
yĕppuḍum̐ gadalagu negagu manusu
(||ĕvvari||)
vūraḍiṁchidini vŏḍam̐barasi nidranu
sārĕ nemariṁchagu manusu
yīrīdi śhrīveṁkaḍeśha yalasidini
seri nannum̐ gṛpa seyam̐gade