ఎవ్వరిని మెప్పించేవే యింతిరో నీవు
(॥పల్లవి॥)
ఎవ్వరిని మెప్పించేవే యింతిరో నీవు
నివ్వటిల్లని వెల్లాను నిలువఁబెట్టేవా
(॥॥)
యేమనేవే చెలియా యెదిరించి నీవు నాతో
నేమపు వానిమాటలు నిజమనేవా
కోమలియుఁ దాను రతిఁ గూడి యుండఁగాఁ గంటి
గామిడిసేతలు యింకా గల్లలనేవా
(॥॥)
వింటిలేవే మగువా వీరిడి నీవిన్న పాలు
అంటిముట్టి వానికిఁగా నానవెట్టేవా
వొంటి నిప్పుడిద్దరును వుప్పరిగెలో నున్నారు
జంట నిది లేదని సాదించేవా
(॥॥)
నీవిదేమె వనితా నేఁడు శ్రీవేంకటేశుఁడు
కావించి నన్నేలెనంటా గతి గూడేవా
దేవులుఁ దాను నిందాఁకా దిష్టము జూజమాడిరి
సేవసేసే యాపె యని చెల్లఁబెట్టేవా
(||pallavi||)
ĕvvarini mĕppiṁcheve yiṁtiro nīvu
nivvaḍillani vĕllānu niluvam̐bĕṭṭevā
(||||)
yemaneve sĕliyā yĕdiriṁchi nīvu nādo
nemabu vānimāḍalu nijamanevā
komaliyum̐ dānu radim̐ gūḍi yuṁḍam̐gām̐ gaṁṭi
gāmiḍisedalu yiṁkā gallalanevā
(||||)
viṁṭileve maguvā vīriḍi nīvinna pālu
aṁṭimuṭṭi vānigim̐gā nānavĕṭṭevā
vŏṁṭi nippuḍiddarunu vupparigĕlo nunnāru
jaṁṭa nidi ledani sādiṁchevā
(||||)
nīvidemĕ vanidā nem̐ḍu śhrīveṁkaḍeśhum̐ḍu
kāviṁchi nannelĕnaṁṭā gadi gūḍevā
devulum̐ dānu niṁdām̐kā diṣhṭamu jūjamāḍiri
sevasese yābĕ yani sĕllam̐bĕṭṭevā