Evvarinela tadaveveeda vaaremi seduru

ఎవ్వరినేల తడవేవీడ వారేమి సేతురు
Language

(॥పల్లవి॥)
ఎవ్వరినేల తడవేవీడ వారేమి సేతురు
జవ్వన పాయముమీఁద సడివేయవే

(॥ఎవ్వ॥)
మందలించి మాతోనేల మాటలకు వచ్చేవు
కందువలు పతినడుగవే నీవు
అంది వుండఁబట్టకుంటే ఆతని నిన్నుఁగూర్చిన
ముందరి మరునికే మొరవెట్టవే

(॥ఎవ్వ॥)
యిల్లురికి మాతోనేల యీసడించ వచ్చేవు
చెల్లుబడాతనిమీదఁ జేయవే నీవు
పల్లదమంత గలిగితే పై పై నెడమాటలాడే
తెల్లమైన నీచెలులఁ దిట్టవే నీవు

(॥ఎవ్వ॥)
సంగడిఁ గూచుండి నీవు సణఁగులేల రాల్చేవు
బంగించి యీతనిఁ దప్పుపట్టవే నీవు
రంగై శ్రీ వేంకటేశుఁడు రమించె నీతఁడు నాతో
అంగడి జాణతనములాడవే నీవు

(||pallavi||)
ĕvvarinela taḍavevīḍa vāremi seduru
javvana pāyamumīm̐da saḍiveyave

(||ĕvva||)
maṁdaliṁchi mādonela māḍalagu vachchevu
kaṁduvalu padinaḍugave nīvu
aṁdi vuṁḍam̐baṭṭaguṁṭe ādani ninnum̐gūrsina
muṁdari marunige mŏravĕṭṭave

(||ĕvva||)
yillurigi mādonela yīsaḍiṁcha vachchevu
sĕllubaḍādanimīdam̐ jeyave nīvu
palladamaṁta galigide pai pai nĕḍamāḍalāḍe
tĕllamaina nīsĕlulam̐ diṭṭave nīvu

(||ĕvva||)
saṁgaḍim̐ gūsuṁḍi nīvu saṇam̐gulela rālsevu
baṁgiṁchi yīdanim̐ dappubaṭṭave nīvu
raṁgai śhrī veṁkaḍeśhum̐ḍu ramiṁchĕ nīdam̐ḍu nādo
aṁgaḍi jāṇadanamulāḍave nīvu