Evvarinainaa nadugu maamaada neevu

ఎవ్వరినైనా నడుగు మామాట నీవు
Language

(॥పల్లవి॥)
ఎవ్వరినైనా నడుగు మామాట నీవు
రవ్వలు సేయుచు నేలెఱఁగవో కాక

(॥ఎవ్వ॥)
మొక్కితినంటా నన్ను మోహపుఁదిట్టుఁ దిట్టేవు
వెక్కసాన నేమైనా వెంగమా యిది
కక్కసించి నీ వొళ్లఁ గల్లలేమి గల్గఁగానో
తక్కరితనమునఁ గాఁతాళించేవుగాక

(॥ఎవ్వ॥)
నగితినంటా నన్నునను గోర నూఁదేవు
వొగరుఁదనముల నీ వొరటా యిది
యెగసక్కెపు నీచేఁత లెందుకు సరివచ్చెనో
పగటున నీలోనీవే భావించేవుగాక

(॥ఎవ్వ॥)
చన్నుల నొత్తితినంటా సారెఁ దప్పకచూచేవు
కన్నెనైన నీ వొద్దిగర్వమా యిది
యిన్నిటా శ్రీ వేంకటేశ యెమ్మెలు గలుగఁగానో
నన్నుఁ గూడితివి నీనయా లిట్టేకాక

(||pallavi||)
ĕvvarinainā naḍugu māmāḍa nīvu
ravvalu seyusu nelĕṟam̐gavo kāga

(||ĕvva||)
mŏkkidinaṁṭā nannu mohabum̐diṭṭum̐ diṭṭevu
vĕkkasāna nemainā vĕṁgamā yidi
kakkasiṁchi nī vŏḽlam̐ gallalemi galgam̐gāno
takkaridanamunam̐ gām̐tāḽiṁchevugāga

(||ĕvva||)
nagidinaṁṭā nannunanu gora nūm̐devu
vŏgarum̐danamula nī vŏraḍā yidi
yĕgasakkĕbu nīsem̐ta lĕṁdugu sarivachchĕno
pagaḍuna nīlonīve bhāviṁchevugāga

(||ĕvva||)
sannula nŏttidinaṁṭā sārĕm̐ dappagasūsevu
kannĕnaina nī vŏddigarvamā yidi
yinniḍā śhrī veṁkaḍeśha yĕmmĕlu galugam̐gāno
nannum̐ gūḍidivi nīnayā liṭṭegāga