ఎవ్వరినైనా మన్నించి యింత సేసుకొంటివి
(॥పల్లవి॥)
ఎవ్వరినైనా మన్నించి యింత సేసుకొంటివి
జవ్వనపాయ మింత సడిఁ బెట్టీని
(॥ఎవ్వ॥)
చెంగట నీవు నాపై చేతులు చాఁచితి వంటా
అంగడిఁ బెట్టి నావలపులాడీ నాకె
వుంగరాలు నాకు నిచ్చి వొడఁబరచితివంటా
జంగిలిసవతులకు సరి నెచ్చరించీని
(॥ఎవ్వ॥)
ముచ్చటలాడి నాకు మోవి చూపితివంటా
పచ్చిసేసి నన్ను సిగ్గువఱచీ నాపె
మెచ్చి నీకంటసరి నామెడఁ బెట్టితివంటా
చెచ్చెరఁ దోడి వారికిఁ జెప్పి చూపీని
(॥ఎవ్వ॥)
లాలించి నన్నుఁ గూడి పల్లకి యెక్కితివంటా
పాలుపడి నన్నునే వుప్పతించీ నాపె
యేలితి నన్ను శ్రీవేంకటేశ యలమేల్మంగను
పోలిమి నందరెరఁగఁ బొగడి చూపీని
(||pallavi||)
ĕvvarinainā manniṁchi yiṁta sesugŏṁṭivi
javvanabāya miṁta saḍim̐ bĕṭṭīni
(||ĕvva||)
sĕṁgaḍa nīvu nābai sedulu sām̐sidi vaṁṭā
aṁgaḍim̐ bĕṭṭi nāvalabulāḍī nāgĕ
vuṁgarālu nāgu nichchi vŏḍam̐barasidivaṁṭā
jaṁgilisavadulagu sari nĕchchariṁchīni
(||ĕvva||)
muchchaḍalāḍi nāgu movi sūbidivaṁṭā
pachchisesi nannu sigguvaṟasī nābĕ
mĕchchi nīgaṁṭasari nāmĕḍam̐ bĕṭṭidivaṁṭā
sĕchchĕram̐ doḍi vārigim̐ jĕppi sūbīni
(||ĕvva||)
lāliṁchi nannum̐ gūḍi pallagi yĕkkidivaṁṭā
pālubaḍi nannune vuppadiṁchī nābĕ
yelidi nannu śhrīveṁkaḍeśha yalamelmaṁganu
polimi naṁdarĕram̐gam̐ bŏgaḍi sūbīni