Evvarimumdaram joobe vedaleni nee guttu

ఎవ్వరిముందరఁ జూపే వేడలేని నీ గుట్టు
Language

(॥పల్లవి॥)
ఎవ్వరిముందరఁ జూపే వేడలేని నీ గుట్టు
నవ్వులేమి నవ్వేవు నాలితనమునను

(॥॥)
విన్నవించీ నాపమాట వినుకొనరాదా
యెన్నిపరాకులు సేసే వెఱిఁగివుండే
సన్న సేసీ నివెల్లా జాడతోఁ జూడరాదా
కన్నులేల మూసేవు కడుసిగ్గుతోడను

(॥॥)
ఆపెయిచ్చెవిడెము అందుకొనరాదా
చూపులేమి చూచేవు సోరణగండ్ల
ఆపని కాసపడితే నట్టె కానిమ్మనరాదా
యేపున నేలకొంకేవు యిందరిలోపలను

(॥॥)
కూడిన యాపెకూటమిఁ గోరి చెంగలించరాదా
వాడుమోముతో నెంత వాను లెంచేవు
యీడనే శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
యీడులేల పెట్టేవు యివ్వలా నవ్వలాను

(||pallavi||)
ĕvvarimuṁdaram̐ jūbe veḍaleni nī guṭṭu
navvulemi navvevu nālidanamunanu

(||||)
vinnaviṁchī nābamāḍa vinugŏnarādā
yĕnnibarāgulu sese vĕṟim̐givuṁḍe
sanna sesī nivĕllā jāḍadom̐ jūḍarādā
kannulela mūsevu kaḍusiggudoḍanu

(||||)
ābĕyichchĕviḍĕmu aṁdugŏnarādā
sūbulemi sūsevu soraṇagaṁḍla
ābani kāsabaḍide naṭṭĕ kānimmanarādā
yebuna nelagŏṁkevu yiṁdarilobalanu

(||||)
kūḍina yābĕgūḍamim̐ gori sĕṁgaliṁcharādā
vāḍumomudo nĕṁta vānu lĕṁchevu
yīḍane śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
yīḍulela pĕṭṭevu yivvalā navvalānu