Evvarimogamu soosi yemanenu naalone

ఎవ్వరిమొగము చూచి యేమనేను నాలోనే
Language

(॥పల్లవి॥)
ఎవ్వరిమొగము చూచి యేమనేను నాలోనే
నవ్వుతా నే మోనమున నన్ను మెచ్చేఁ గాక

(॥ఎవ్వ॥)
సిగ్గువడ్డ చిత్తమిది చెలువుని దూరీనా
దగ్గరి గుబ్బతిలుచు దాఁగుఁ గాక
బెగ్గిలాన చెలులై నాఁ బిలుచుక రాఁబోయేరా
అగ్గమై వాని కిచ్చలు ఆడు చుండేరు గాక

(॥ఎవ్వ॥)
కాఁకఁ బొందినమే నిదే కాంతునితోఁ బెనఁగీనా
ఆఁకదీర వుస్సు రస్సు రనుఁ గాక
యేఁకట మరుఁడై నాను ఇద్దరినిఁ గూరిచీనా
వూఁకొనక దుర్బలుల కోపు నింతే కాక

(॥ఎవ్వ॥)
ఆసలఁ బొందినచూపు ఆతనిఁ గోపగించీనా
వేసరక మొకమోడి వీఁగుఁ గాక
యీసరినె శ్రీవేంకటేశుఁ డిట్టే నన్నుఁ గూడె
రాసి కెక్క నాతఁడే రక్షించుఁ గాక

(||pallavi||)
ĕvvarimŏgamu sūsi yemanenu nālone
navvudā ne monamuna nannu mĕchchem̐ gāga

(||ĕvva||)
sigguvaḍḍa sittamidi sĕluvuni dūrīnā
daggari gubbadilusu dām̐gum̐ gāga
bĕggilāna sĕlulai nām̐ bilusuga rām̐boyerā
aggamai vāni kichchalu āḍu suṁḍeru gāga

(||ĕvva||)
kām̐kam̐ bŏṁdiname nide kāṁtunidom̐ bĕnam̐gīnā
ām̐kadīra vussu rassu ranum̐ gāga
yem̐kaḍa marum̐ḍai nānu iddarinim̐ gūrisīnā
vūm̐kŏnaga durbalula kobu niṁte kāga

(||ĕvva||)
āsalam̐ bŏṁdinasūbu ādanim̐ gobagiṁchīnā
vesaraga mŏgamoḍi vīm̐gum̐ gāga
yīsarinĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭe nannum̐ gūḍĕ
rāsi kĕkka nādam̐ḍe rakṣhiṁchum̐ gāga