Evvarim gaadanamgala vemisesinaam jellu

ఎవ్వరిఁ గాదనఁగల వేమిసేసినాఁ జెల్లు
Language

(॥పల్లవి॥)
ఎవ్వరిఁ గాదనఁగల వేమిసేసినాఁ జెల్లు
ఇవ్వల నాకు బాసలేల సేసేవయ్యా

(॥ఎవ్వ॥)
వరుసకు వచ్చినట్టి వనితలెల్లా నీకు
అరుదుగ మందెమేళా లయనయ్యా
పొరుగున నుండేయట్టిపొలఁతులందరూను
మురిపేననాడే పెద్ద మొగమోట మయ్యా

(॥ఎవ్వ॥)
కొలువున నుండి నట్టికోమలు అందరును
సలిగెలఁ బెనఁగేదే సాజమయ్యా
పలువూడిగాలు సేసేభామల కందరికి
చలివాసి కూడేది ‘మజ్జాతి’ నీక నయ్యా

(॥ఎవ్వ॥)
యెడమాట లాడేటి ఇంతులకెల్లా నీవు
కడలేనిరతులకుఁ గాణాచయ్యా
అడరి శ్రీవేంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
యెడయనిచుట్టరిక మిది నాకునయ్యా

(||pallavi||)
ĕvvarim̐ gādanam̐gala vemisesinām̐ jĕllu
ivvala nāgu bāsalela sesevayyā

(||ĕvva||)
varusagu vachchinaṭṭi vanidalĕllā nīgu
aruduga maṁdĕmeḽā layanayyā
pŏruguna nuṁḍeyaṭṭibŏlam̐tulaṁdarūnu
muribenanāḍe pĕdda mŏgamoḍa mayyā

(||ĕvva||)
kŏluvuna nuṁḍi naṭṭigomalu aṁdarunu
saligĕlam̐ bĕnam̐gede sājamayyā
paluvūḍigālu sesebhāmala kaṁdarigi
salivāsi kūḍedi ‘majjādi’ nīga nayyā

(||ĕvva||)
yĕḍamāḍa lāḍeḍi iṁtulagĕllā nīvu
kaḍaleniradulagum̐ gāṇāsayyā
aḍari śhrīveṁkaḍeśha aṭṭĕ nannum̐ gūḍidivi
yĕḍayanisuṭṭariga midi nāgunayyā