ఎవ్వరిఁ బోలుదు నేను యేఁటికి బాఁతి
(॥పల్లవి॥)
ఎవ్వరిఁ బోలుదు నేను యేఁటికి బాఁతి
నవ్వుచు నాపైనేల ననుపు చల్లేవు
(॥ఎవ్వ॥)
చెలిమిసేసే వరలు సేనాసేన లుండఁగా
యెలమి నాపయ్యద నీవేల పట్టేవు
తలపోఁత లిందరిపై తగులై వుండఁగాను
చెలఁగి నారూపమేల చిత్తానఁ బెట్టేవు
(॥ఎవ్వ॥)
కానుకలిచ్చే వారు కలసి నీకుండఁగాను
అనుక నాచన్నుల అందుకొనేవు
వీనులు చెలులు సేసేవనినపాలు వినఁగాను
మానక నతోనేల మాటలాడేవు
(॥ఎవ్వ॥)
కూరిమిసేసేటివారు కొంగువట్టుకుండఁగాను
గారవించి నన్ను నేల కాఁగిలించేవు
యీరీతి శ్రీవేంకటేశ ఇన్ని నింపులై వుండఁగా
మేరమీరి ఇంతయేల మెచ్చులు మెచ్చేవు
(||pallavi||)
ĕvvarim̐ boludu nenu yem̐ṭigi bām̐ti
navvusu nābainela nanubu sallevu
(||ĕvva||)
sĕlimisese varalu senāsena luṁḍam̐gā
yĕlami nābayyada nīvela paṭṭevu
talabom̐ta liṁdaribai tagulai vuṁḍam̐gānu
sĕlam̐gi nārūbamela sittānam̐ bĕṭṭevu
(||ĕvva||)
kānugalichche vāru kalasi nīguṁḍam̐gānu
anuga nāsannula aṁdugŏnevu
vīnulu sĕlulu sesevaninabālu vinam̐gānu
mānaga nadonela māḍalāḍevu
(||ĕvva||)
kūrimiseseḍivāru kŏṁguvaṭṭuguṁḍam̐gānu
gāraviṁchi nannu nela kām̐giliṁchevu
yīrīdi śhrīveṁkaḍeśha inni niṁpulai vuṁḍam̐gā
meramīri iṁtayela mĕchchulu mĕchchevu