Evvarim bogadudumu yemtani nemu mechchemu

ఎవ్వరిఁ బొగడుదుము యెంతని నేము మేచ్చేము
Language

(॥పల్లవి॥)
ఎవ్వరిఁ బొగడుదుము యెంతని నేము మేచ్చేము
బువ్వముల కిచ్చడా(లా?)య భోగపు మీ కతలు

(॥ఎవ్వ॥)
జక్కవచన్నులమీఁద సరులు నీ వంటఁగాను
చెక్కులెల్లాఁ జెమరించె చెలియకు
యెక్కడి కెక్కడ సూత్ర మెంతనేరిచె మరుఁడు
పుక్కిటి పురాణమాయ పొందులమీచేఁతలు

(॥ఎవ్వ॥)
తుమ్మిద నెరులకొప్పు దొడ్డగా నీవు వెట్టఁగ
కమ్మి మేను పులకించె కాంతకు
యెమ్మెల నేడకునేడ యెంతసేసీ యీవలపు
వుమ్మడినే దిగుపారె వొళ్ళనే మీ జాడలు

(॥ఎవ్వ॥)
గక్కన కంబుకంఠము కాఁగిలించుకొనఁగాను
ఇక్కువలు గరఁగెను ఇంతికి
ఇక్కడ శ్రీ వేంకటేశ యెంతకెంత మీ నేర్పులు
వక్కణలలేకలాయ వాడిక మీరతులు

(||pallavi||)
ĕvvarim̐ bŏgaḍudumu yĕṁtani nemu mechchemu
buvvamula kichchaḍā(lā?)ya bhogabu mī kadalu

(||ĕvva||)
jakkavasannulamīm̐da sarulu nī vaṁṭam̐gānu
sĕkkulĕllām̐ jĕmariṁchĕ sĕliyagu
yĕkkaḍi kĕkkaḍa sūtra mĕṁtanerisĕ marum̐ḍu
pukkiḍi purāṇamāya pŏṁdulamīsem̐talu

(||ĕvva||)
tummida nĕrulagŏppu dŏḍḍagā nīvu vĕṭṭam̐ga
kammi menu pulagiṁchĕ kāṁtagu
yĕmmĕla neḍaguneḍa yĕṁtasesī yīvalabu
vummaḍine digubārĕ vŏḽḽane mī jāḍalu

(||ĕvva||)
gakkana kaṁbugaṁṭhamu kām̐giliṁchugŏnam̐gānu
ikkuvalu garam̐gĕnu iṁtigi
ikkaḍa śhrī veṁkaḍeśha yĕṁtagĕṁta mī nerbulu
vakkaṇalalegalāya vāḍiga mīradulu