Evvarigim jeppamdamma yedaloni marmamu

ఎవ్వరికిఁ జెప్పఁడమ్మ యెదలోని మర్మము
Language

(॥పల్లవి॥)
ఎవ్వరికిఁ జెప్పఁడమ్మ యెదలోని మర్మము
నివ్వటిల్ల భోగించ నెరజాణఁ డితఁడు

(॥ఎవ్వ॥)
మెలుఁత కెవ్వతెకొ మేలువాఁడు గాఁబోలు
చలువగాఁ బన్నీట మజ్జనమాడీని
కలయఁగ మేనఁ బచ్చకప్పురము మెత్తుకొనీ
తలఁపులోని విరహతాపమెల్లా నారను

(॥ఎవ్వ॥)
అప్పటి శైత్యొపచారా లందుకుఁగాఁ జేయఁబోలు
గుప్పుకొనీఁ దులసిచిగురుదండలు
యెప్పుడూ నాలవట్టము లిరుమేలాఁ జేకొనీని
చిప్పిలువలపుల ముంచినవెట్ట దీరను

(॥ఎవ్వ॥)
కూరిమి చలిమందులకొరకుఁగానే కాంబోలు
కోరి చలువరాళ్లకొండ నున్నాఁడు
యీరీతి శ్రీవేంకటేశుఁ డిందిరతోఁ గూడినాఁడు
తారని రతులజాణతనములు మీరను

(||pallavi||)
ĕvvarigim̐ jĕppam̐ḍamma yĕdaloni marmamu
nivvaḍilla bhogiṁcha nĕrajāṇam̐ ḍidam̐ḍu

(||ĕvva||)
mĕlum̐ta kĕvvadĕgŏ meluvām̐ḍu gām̐bolu
saluvagām̐ bannīḍa majjanamāḍīni
kalayam̐ga menam̐ bachchagappuramu mĕttugŏnī
talam̐puloni virahadābamĕllā nāranu

(||ĕvva||)
appaḍi śhaityŏbasārā laṁdugum̐gām̐ jeyam̐bolu
guppugŏnīm̐ dulasisigurudaṁḍalu
yĕppuḍū nālavaṭṭamu lirumelām̐ jegŏnīni
sippiluvalabula muṁchinavĕṭṭa dīranu

(||ĕvva||)
kūrimi salimaṁdulagŏragum̐gāne kāṁbolu
kori saluvarāḽlagŏṁḍa nunnām̐ḍu
yīrīdi śhrīveṁkaḍeśhum̐ ḍiṁdiradom̐ gūḍinām̐ḍu
tārani radulajāṇadanamulu mīranu