ఎవ్వరికిఁ దెలుసు నీ యిట్టి మాయలు
(॥పల్లవి॥)
ఎవ్వరికిఁ దెలుసు నీ యిట్టి మాయలు
రవ్వలుగాఁ జూడఁ బోతే రంటికిని వత్తువూ
(॥ఎవ్వరికి॥)
నగవులు సారె నీకు నవ్వ వచ్చుఁ గాక మాకు
పగ సవతులచేతఁ బడ వచ్చునా
పగలుమేలము చాలు పద వోయి నీ కేమి
తగులువిరికాఁడవు దక్కినట్టే వుందువూ
(॥ఎవ్వరికి॥)
చేఁత లెల్లఁ జేసి నీకుఁ జెక్కు నొక్క వచ్చుఁగాక
బాఁతిపడి విరహనఁ బడఁ గలమా
లేఁతమాట లాడ వద్దు లేవోయి వలపులు
పాఁతగిలితేఁ జాలు పనులే మరతువూ
(॥ఎవ్వరికి॥)
గతి గూడి నీకు మమ్ముఁ గాఁగిలించ వచ్చుఁ గాక
అతివలయు నిన్ను రమ్మన నోపేమా
సతమై శ్రీవెంకటేశ చన విచ్చి కూడితివి
యిత వయినచోటికి నీ వెట్టయినఁ జేతువూ
(||pallavi||)
ĕvvarigim̐ dĕlusu nī yiṭṭi māyalu
ravvalugām̐ jūḍam̐ bode raṁṭigini vattuvū
(||ĕvvarigi||)
nagavulu sārĕ nīgu navva vachchum̐ gāga māgu
paga savadulasedam̐ baḍa vachchunā
pagalumelamu sālu pada voyi nī kemi
taguluvirigām̐ḍavu dakkinaṭṭe vuṁduvū
(||ĕvvarigi||)
sem̐ta lĕllam̐ jesi nīgum̐ jĕkku nŏkka vachchum̐gāga
bām̐tibaḍi virahanam̐ baḍam̐ galamā
lem̐tamāḍa lāḍa vaddu levoyi valabulu
pām̐tagilidem̐ jālu panule maraduvū
(||ĕvvarigi||)
gadi gūḍi nīgu mammum̐ gām̐giliṁcha vachchum̐ gāga
adivalayu ninnu rammana nobemā
sadamai śhrīvĕṁkaḍeśha sana vichchi kūḍidivi
yida vayinasoḍigi nī vĕṭṭayinam̐ jeduvū