Evvarigi yevvarayyeru yimdarigi neeve dikku

ఎవ్వరికి యెవ్వరయ్యేరు యిందరికి నీవే దిక్కు
Language

(॥పల్లవి॥)
ఎవ్వరికి యెవ్వరయ్యేరు యిందరికి నీవే దిక్కు
అవ్వలనివ్వల నీ వనాథనాథుఁడవు

(॥ఎవ్వ॥)
కాయకము లందురునుఁ గార్యవశపరులే
పాయని నీ వకారణబంధుఁడవు
దాయగాం డ్లెవ్వరినైనాఁ దప్పించుకొనేవారే
బాయటనున్నా నీవాపన్నశరణ్యుఁడవు

(॥ఎవ్వ॥)
అట్టె లోకమువారు అర్థకామపరులే
జట్టిగొని నీవైతే సర్వదాతవు
పొట్టఁబొరుగుచుట్టాలు భోజనసహాయులే
నెట్టన నీవైతే మాకు నిర్వాహకుఁడవు

(॥ఎవ్వ॥)
అంతటా వారికివారు ఆత్మపోషకులే
రంతుల నీవైతే నానారక్షకుఁడవు
సంతతము శ్రీవేంకటేశా మమ్ము నేలితివి
పంతమున నీవు భక్తపరిపాలకుఁడవు

(||pallavi||)
ĕvvarigi yĕvvarayyeru yiṁdarigi nīve dikku
avvalanivvala nī vanāthanāthum̐ḍavu

(||ĕvva||)
kāyagamu laṁdurunum̐ gāryavaśhabarule
pāyani nī vagāraṇabaṁdhum̐ḍavu
dāyagāṁ ḍlĕvvarinainām̐ dappiṁchugŏnevāre
bāyaḍanunnā nīvābannaśharaṇyum̐ḍavu

(||ĕvva||)
aṭṭĕ logamuvāru ardhagāmabarule
jaṭṭigŏni nīvaide sarvadādavu
pŏṭṭam̐bŏrugusuṭṭālu bhojanasahāyule
nĕṭṭana nīvaide māgu nirvāhagum̐ḍavu

(||ĕvva||)
aṁtaḍā vārigivāru ātmaboṣhagule
raṁtula nīvaide nānārakṣhagum̐ḍavu
saṁtadamu śhrīveṁkaḍeśhā mammu nelidivi
paṁtamuna nīvu bhaktabaribālagum̐ḍavu