(॥పల్లవి॥)
ఎవ్వరికి విన్నప మిఁకనేల
యివ్వల నీ దయ యింతటఁ గలది
(॥ఎవ్వ॥)
మనసునఁ బెనగొనుమాటల కేకా
తనవునఁ దమకము తతిగొనెను
ననువున నుండిన నయములకేకా
కనుఁగొనఁ జూపులు కడిమీఁ జెలికి
(॥ఎవ్వ॥)
నంటునఁ గొసరిననవ్వుల కేకా
జంటల నిట్టూర్పు సతమాయ
అంటుముట్టు అడియాసకేకా
మెంటునఁ జెమటలు మిక్కిలిఁ బొలసె
(॥ఎవ్వ॥)
కూడిన తొల్లిటి కూటముల కెకా
వీడని వేడుక వెసఁ నలిగె
యీడనె శ్రీ వేంకటేశ కలిసితివి
నీడలఁ గాంతకు నిర్మలమాయ
(||pallavi||)
ĕvvarigi vinnaba mim̐kanela
yivvala nī daya yiṁtaḍam̐ galadi
(||ĕvva||)
manasunam̐ bĕnagŏnumāḍala kegā
tanavunam̐ damagamu tadigŏnĕnu
nanuvuna nuṁḍina nayamulagegā
kanum̐gŏnam̐ jūbulu kaḍimīm̐ jĕligi
(||ĕvva||)
naṁṭunam̐ gŏsarinanavvula kegā
jaṁṭala niṭṭūrbu sadamāya
aṁṭumuṭṭu aḍiyāsagegā
mĕṁṭunam̐ jĕmaḍalu mikkilim̐ bŏlasĕ
(||ĕvva||)
kūḍina tŏlliḍi kūḍamula kĕgā
vīḍani veḍuga vĕsam̐ naligĕ
yīḍanĕ śhrī veṁkaḍeśha kalisidivi
nīḍalam̐ gāṁtagu nirmalamāya