Evvarigi valaduve seli

ఎవ్వరికి వలతువే చెలి
Language

(॥పల్లవి॥)
ఎవ్వరికి వలతువే చెలి
యివ్వలఁ బిలిచిన నెఱుఁగవే చెలియా

(॥ఎవ్వరి॥)
చక్కఁగఁ బయ్యద జాఱిన దెఱుఁగవు
యెక్కడ చూచేవే యిటు చెలియా
చెక్కులవెంటాఁ జెమటలు వడియఁగ
ముక్కున మార్పులు ముంచేవే చెలియా

(॥ఎవ్వరి॥)
తోరంబగు నీతురుమును ముడువవు
యీరీతి పరాకు లివె చెలియా
నేరుపుమాటలు నీ విపు డాడవు
తీరక లో వెలిఁ దిరిగేవే చెలియా

(॥ఎవ్వరి॥)
వెలయు పాదములు వెనకకు వేసితి
తలఁ పెందున్నదె తగఁ జెలియ
కలసెను శ్రీవేంకటపతి నిను నిటు
కులికి యతనిఁ బేర్కొనవే చెలియా

(||pallavi||)
ĕvvarigi valaduve sĕli
yivvalam̐ bilisina nĕṟum̐gave sĕliyā

(||ĕvvari||)
sakkam̐gam̐ bayyada jāṟina dĕṟum̐gavu
yĕkkaḍa sūseve yiḍu sĕliyā
sĕkkulavĕṁṭām̐ jĕmaḍalu vaḍiyam̐ga
mukkuna mārbulu muṁcheve sĕliyā

(||ĕvvari||)
toraṁbagu nīdurumunu muḍuvavu
yīrīdi parāgu livĕ sĕliyā
nerubumāḍalu nī vibu ḍāḍavu
tīraga lo vĕlim̐ dirigeve sĕliyā

(||ĕvvari||)
vĕlayu pādamulu vĕnagagu vesidi
talam̐ pĕṁdunnadĕ tagam̐ jĕliya
kalasĕnu śhrīveṁkaḍabadi ninu niḍu
kuligi yadanim̐ bergŏnave sĕliyā