Evvarigi nemi vodu yeduraademaa

ఎవ్వరికి నేమి వోదు యెదురాడేమా
Language

(॥పల్లవి॥)
ఎవ్వరికి నేమి వోదు యెదురాడేమా
నివ్వటిల్లఁ జేసేవారు నీవారే సుమ్మీ

(॥ఎవ్వ॥)
నగవులు నీమాటలు నన్ను నేమి యడిగేవు
తగిలితేఁ జెప్పేరు యీతరుణులే
యెగసక్కెములు గావు యియ్యకోలు సేసే నింతే
నెగులుదీరిచేవారు నీవారే సుమ్మీ

(॥ఎవ్వ॥)
నాటకాలు నీచేఁతలు నామోమే చూచేవు
పాటించితే తెలిపే రీపడఁతులే
యీటు వెట్టుకొన నీతో యింతా విచారించే నింతే
నీటున నడపేవారు నీవారే సుమ్మీ

(॥ఎవ్వ॥)
నమ్మితి నీపొందు లివె నాకేల బాస సేసేవు
సమ్మతించితే మెచ్చే రీసవతులే
కమ్ముక శ్రీ వేంకటేశ కలసితి విటు నన్ను
నెమ్మదిఁ బొగడేవారు నీవారే సుమ్మీ

(||pallavi||)
ĕvvarigi nemi vodu yĕdurāḍemā
nivvaḍillam̐ jesevāru nīvāre summī

(||ĕvva||)
nagavulu nīmāḍalu nannu nemi yaḍigevu
tagilidem̐ jĕpperu yīdaruṇule
yĕgasakkĕmulu gāvu yiyyagolu sese niṁte
nĕguludīrisevāru nīvāre summī

(||ĕvva||)
nāḍagālu nīsem̐talu nāmome sūsevu
pāḍiṁchide tĕlibe rībaḍam̐tule
yīḍu vĕṭṭugŏna nīdo yiṁtā visāriṁche niṁte
nīḍuna naḍabevāru nīvāre summī

(||ĕvva||)
nammidi nībŏṁdu livĕ nāgela bāsa sesevu
sammadiṁchide mĕchche rīsavadule
kammuga śhrī veṁkaḍeśha kalasidi viḍu nannu
nĕmmadim̐ bŏgaḍevāru nīvāre summī