ఎవ్వరికి జెప్పేవే యీ సుద్దులు
(॥పల్లవి॥)
ఎవ్వరికి జెప్పేవే యీ సుద్దులు
జవ్వనము కట్టిపెట్టి సాదవయ్యేవా
(॥॥)
పావనము సేసాతఁడు పలుకఁగా లోఁగేవు
సేవసేసే దానికింత సిగ్గులేఁటికే
తావుకొని సతులెల్లా దండనుండఁగాఁ గాక
భావించి యేకతమైతేఁ బై కొనకుండేవా
(॥॥)
వాడికగా నాతఁడు నవ్వఁగాఁ దలవంచేవు
వేడుకక త్తెవు నీకు వెరపేఁటికే
యీడఁ బట్టపు దేవుళ్ళ నిందరినిఁ జూచి కాక
కూడేవేళ నింటిలోనఁ గొంకఁ జూచేవా
(॥॥)
కప్పి శ్రీవేంకటేశుఁడు కాఁగిలించఁగా నవ్వేవు
యెప్పటి దానవు నీకు నెమ్మెలేఁటికే
అప్పటి నేము గూడిన ఆవరుస యెంచి కాక
ముప్పిరి నీవరుసను మోసపొయ్యేవా
(||pallavi||)
ĕvvarigi jĕppeve yī suddulu
javvanamu kaṭṭibĕṭṭi sādavayyevā
(||||)
pāvanamu sesādam̐ḍu palugam̐gā lom̐gevu
sevasese dānigiṁta siggulem̐ṭige
tāvugŏni sadulĕllā daṁḍanuṁḍam̐gām̐ gāga
bhāviṁchi yegadamaidem̐ bai kŏnaguṁḍevā
(||||)
vāḍigagā nādam̐ḍu navvam̐gām̐ dalavaṁchevu
veḍugaga ttĕvu nīgu vĕrabem̐ṭige
yīḍam̐ baṭṭabu devuḽḽa niṁdarinim̐ jūsi kāga
kūḍeveḽa niṁṭilonam̐ gŏṁkam̐ jūsevā
(||||)
kappi śhrīveṁkaḍeśhum̐ḍu kām̐giliṁcham̐gā navvevu
yĕppaḍi dānavu nīgu nĕmmĕlem̐ṭige
appaḍi nemu gūḍina āvarusa yĕṁchi kāga
muppiri nīvarusanu mosabŏyyevā