ఎవ్వరికి దొరకును యీ భాగ్యము
(॥పల్లవి॥)
ఎవ్వరికి దొరకును యీ భాగ్యము
జవ్వనికి వెూవితేనె చవిచూపరాదా
(॥॥)
జక్కవచన్నులమీఁ ద జారినపయ్యదతోడ
చెక్కులపైఁ దొరిగోటి చెమటతోడ
మొక్కిమొక్కి నీకుఁ దనమేహమెల్లా విన్నవించీ
అక్కరగలచెలియ నాదరించరాదా
(॥॥)
వాసననపువ్వులతోడివదలుఁ దురుముతోడ
ఆసలనిట్టూర్పులయలపులతోడ
పోసరించఁ బాదాలొత్తి పొందులెల్లాఁ దెలిపీని
వాసితోడిసతికిఁ గైవసముగారాదా
(॥॥)
జడికొన్న పులకలుజాజికొన్న మేనితోడిఁ
కడలేనిరతి నిండుఁ గళలతోడ
అడరి శ్రీ వేంకటేశ ఆకె నిన్నుఁ గూడీని
యెడయనికాంతను నీవిట్టె మెప్పించరాదా
(||pallavi||)
ĕvvarigi dŏragunu yī bhāgyamu
javvanigi vĕూvidenĕ savisūbarādā
(||||)
jakkavasannulamīm̐ da jārinabayyadadoḍa
sĕkkulabaim̐ dŏrigoḍi sĕmaḍadoḍa
mŏkkimŏkki nīgum̐ danamehamĕllā vinnaviṁchī
akkaragalasĕliya nādariṁcharādā
(||||)
vāsananabuvvuladoḍivadalum̐ durumudoḍa
āsalaniṭṭūrbulayalabuladoḍa
posariṁcham̐ bādālŏtti pŏṁdulĕllām̐ dĕlibīni
vāsidoḍisadigim̐ gaivasamugārādā
(||||)
jaḍigŏnna pulagalujājigŏnna menidoḍim̐
kaḍaleniradi niṁḍum̐ gaḽaladoḍa
aḍari śhrī veṁkaḍeśha āgĕ ninnum̐ gūḍīni
yĕḍayanigāṁtanu nīviṭṭĕ mĕppiṁcharādā