Evvarigi buddi seppe neṟamga mari

ఎవ్వరికి బుద్ది చెప్పే నెఱఁగ మరి
Language

(॥పల్లవి॥)
ఎవ్వరికి బుద్ది చెప్పే నెఱఁగ మరి
యివ్వల నే నుండదాన నెఱఁగ మరి

(॥ఎవ్వరికి॥)
చెక్కు చెలిచేత నుండె నింత మదిలోన నుండె
యిక్కడికి నే వచ్చితి నెఱఁగమరి
పక్కన నంపవు మమ్ము పదరి నీవు రావు
యెక్కు నీ చిత్త మొట్టో యెఱఁగ మరి

(॥ఎవ్వరికి॥)
వుమ్మచెమటలఁ దోఁగె నువిద కాఁకల రాఁగె
యిమ్మల నన్నీడ కంపె నెఱఁగ మరి
కొమ్మసుద్దు లడిగేవు గుట్టునఁ దల వంచేవు
యెమ్మె లేమి సేసేవో యెఱఁగ మరి

(॥ఎవ్వరికి॥)
యిందాఁకాఁ దమకించె యింతి యిట్టె పవ్వళించె
యిందున్నదాన నేను యెఱఁగ మరి
అంది శ్రీవెంకటేశుఁడ ఆడకె నీవు విచ్చేసి
యిందుముఖిఁ గూడితివి యెఱఁగ మరి

(||pallavi||)
ĕvvarigi buddi sĕppe nĕṟam̐ga mari
yivvala ne nuṁḍadāna nĕṟam̐ga mari

(||ĕvvarigi||)
sĕkku sĕliseda nuṁḍĕ niṁta madilona nuṁḍĕ
yikkaḍigi ne vachchidi nĕṟam̐gamari
pakkana naṁpavu mammu padari nīvu rāvu
yĕkku nī sitta mŏṭṭo yĕṟam̐ga mari

(||ĕvvarigi||)
vummasĕmaḍalam̐ dom̐gĕ nuvida kām̐kala rām̐gĕ
yimmala nannīḍa kaṁpĕ nĕṟam̐ga mari
kŏmmasuddu laḍigevu guṭṭunam̐ dala vaṁchevu
yĕmmĕ lemi sesevo yĕṟam̐ga mari

(||ĕvvarigi||)
yiṁdām̐kām̐ damagiṁchĕ yiṁti yiṭṭĕ pavvaḽiṁchĕ
yiṁdunnadāna nenu yĕṟam̐ga mari
aṁdi śhrīvĕṁkaḍeśhum̐ḍa āḍagĕ nīvu vichchesi
yiṁdumukhim̐ gūḍidivi yĕṟam̐ga mari